ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సత్తా చాటారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు క్వార్టర్స్‌కు చేరింది.
గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో సాయిప్రణీత్ 18-21, 21-16, 21-15 తేడాతో ఐదో సీడ్ సమీర్ వర్మను ఓడించాడు. మూడో సీడ్ శ్రీకాంత్ 21-11, 21-16 తేడాతో వరుస సెట్లలో లూ గ్వాంగ్జూ (చైనా)పై గెలుపొందగా, ప్రణయ్ 21-19, 20-22, 21-17 తేడాతో జాన్ జార్జెన్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. పారుపల్లి కశ్యప్ 21-11, 21-13 తేడాతో వరుస సెట్లలో తనోంగ్సక్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. నేడు జరగనున్న పురుషుల క్వార్టర్స్‌లో శ్రీకాంత్... సాయిప్రణీత్‌తో తలపడనున్నాడు.
- తిరుగులేని సింధు....