కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. పతకంపై ఆశలు రేపిన పారుపల్లి కశ్యప్.. సెమీస్‌లో ఓడిపోయాడు. జపాన్‌కు చెందిన కెంటో మొమొటా చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టాడు.
రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కెంటోతో జరిగిన పోరులో చేతులెత్తేశాడు కశ్యప్. వరుస సెట్లలో ఓటమి చెంది నిరాశపర్చాడు. ఇప్పటికే మూడుసార్లు వీరిద్దరూ తలపడగా ప్రతిసారి కెంటో పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం సాధించినమొమొటా.. భారత ఆటగాడిపై 21-13, 21-15 తేడాతో గెలుపొందాడు.