తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింధుకు సులువైన డ్రా.. శ్రీకాంత్​, సైనాకు మాత్రం.. - కిదాంబి శ్రీకాంత్​ ఇండియా ఓపెన్​ 2022

India Open 2022 BWF: 2022 బీడబ్ల్యూఎఫ్​ సీజన్​లో భాగంగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇండియా ఓపెన్​ టోర్నీకి సంబంధించిన డ్రాను భారత బ్యాడ్మింటన్​ సమాఖ్య ప్రకటించింది​. స్టార్ల్​ షట్లర్స్​ పీవీ సింధు, లక్ష్య సేన్​కు సులువైన డ్రా లభించగా.. సైనా నెహ్వాల్​కు కఠిన డ్రా ఎదురైంది.

సింధు, శ్రీకాంత్​, సైనా, sindhu
సింధు, శ్రీకాంత్​, సైనా

By

Published : Dec 23, 2021, 10:00 PM IST

India Open 2022 BWF: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి జోరుమీదున్నాడు భారత స్టార్‌ షట్లర్ కిదాంబి శ్రీకాంత్​. అయితే ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో తనను ఓడించిన కీన్‌ యూపై(సింగపూర్​) ప్రతీకారం తీర్చుకునే అవకాశం అతడికి వచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న యోనెక్స్​ సన్​రైస్​ ఇండియా ఓపెన్​ టోర్నీలో వీరిద్దరూ మళ్లీ తలపడబోతున్నారు. ఈ టోర్నీలో సిరిల్​ వర్మతో తన తొలి మ్యాచ్​ను మొదలుపెట్టనున్న అతడు.. సెమీఫైనల్​లో కీన్​ను ఢీ కొననున్నాడు.

ఈ టోర్నీ సూపర్​ 500 ఈవెంట్​లో స్టార్​ షట్లర్​ లక్ష్య సేన్​కు సులవైన డ్రా ఎదురైంది. ఈజిప్ట్​కు చెందిన అధమ్​తో​(Adham Elgamal) తన తొలి మ్యాచ్​ను ఆడనున్నాడు. క్వార్టర్​ ఫైనల్స్​లో హెచ్​ ఎస్​ ప్రణయ్​తో తలపడనున్నాడు. ప్రణయ్.. పాబ్లో ఏబియన్​తో(Spaniard Pablo Abian) తన మ్యాచ్​లు మొదలుపెట్టనున్నాడు.

రెండో సీడ్​ బి.సాయి ప్రణీత్​కు కఠిన డ్రా ఎదురైంది. ఓపెనింగ్ ​రౌండ్​లో లూయిస్​ పెనాల్వర్​తో(Luis Penalver) క్వార్టర్​ ఫైనల్స్​లో ఇండినేషియా ప్లేయర్​ టామీను(Tommy Sugiarto) ఢీ కొననున్నాడు.

మహిళల సింగిల్స్

స్టార్​ షట్లర్స్​ పీవీ సింధుకు సులువైన డ్రా లభించింది. సింధు తన తొలి మ్యాచ్​ను శ్రీ కృష్ణ ప్రియ కుదరవల్లితో ప్రారంభించగా.. లాస్ట్​-8 స్టేజీలో రష్యా ఐదో సీడ్​ జెనియాతో(Evgeniya Kosetskaya) తలపడనుంది.

గాయాలతో సతమతమవుతున్న సైనా నెహ్వాల్​కు మాత్రం కఠిన డ్రా పడింది. క్వార్టర్​ ఫైనల్​లో​ ఏడో సీడ్​ ఇరిష్​ వాంగ్​తో​(యూఎస్​ఏ), సెమీఫైనల్​లో రెండో సీడ్​ బుసనన్​తో(Busanan Ongbamrungphan) పోటీ పడనుంది.

పురుషుల, మహిళల డబుల్స్​

పురుషుల డబుల్స్​లో చిరాగ్​శెట్టి-సాత్విక్​సాయిరాజ్​ రంకిరెడ్డి.. రవి-చిరాగ్​ అరోరా ద్వయంతో మ్యాచ్​ను ప్రారంభించగా.. లాస్ట్​-4 స్టేజీలో ఇంగ్లాడ్​కు చెందిన నాలుగో సీడ్​ బెన్ లేన్-సీన్ వెండీ జోడీతో తలపడొచ్చు.

మహిళల డబుల్స్​లో రెండో సీడ్​ ద్వయం అశ్విని పొన్నప్ప-ఎన్​ సిక్కీ రెడ్డీకి క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకునేందుకు సులుడైన డ్రా లభించింది. అయితే మిక్స్​డ్​ డబుల్స్​లో ఓపెనింగ్​ రౌండ్​లో బి సుమిత్​ రెడ్డి-పొన్నప్ప జోడీకి మాత్రం కాస్త కష్టమైన డ్రా అనే చెప్పాలి. ఈ జోడీ రెండో సీడ్​ రష్యా ద్వయం రొడియోన్​-అలీనాతో(Rodion Alimov-Alina Davletova) పోటీ పడనున్నారు.

ఈ టోర్నీ దిల్లీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16వరకు జరగనున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: kidambi srikanth BWF: ఫైనల్​లో ఓడినా చరిత్రే

ABOUT THE AUTHOR

...view details