తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్వార్టర్స్​లో శ్రీకాంత్.. ప్రణయ్ నిష్క్రమణ - prannoy out

హాంకాంగ్ ఓపెన్​ టోర్నీలో షట్లర్ కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్​కు చేరాడు. పురుషుల సింగిల్స్​లో మన దేశానికే చెందిన సౌరభ్ వర్మపై గెలిచాడు. ప్రణయ్ వర్మ.. ఇండోనేసియాకు చెందిన జొనాథన్​ చేతిలో ఓడిపోయాడు.

శ్రీకాంత్ - ప్రణయ్

By

Published : Nov 14, 2019, 3:33 PM IST

చైనా ఓపెన్​కు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. హాంకాంగ్ ఓపెన్​లో సత్తాచాటుతున్నాడు. పురుషుల సింగిల్స్​ విభాగం రెండో రౌండ్​లో మన దేశానికే చెందిన సౌరభ్ వర్మపై నెగ్గి క్వార్టర్ ఫైనల్​కు చేరాడు.

శ్రీకాంత్..21-11, 15-21, 21-19 తేడాతో సౌరభ్​పై గెలిచాడు. తొలి సెట్లో సునాయాసంగా నెగ్గిన ఈ షట్లర్.. రెండో గేమ్​లో పరాజయం పాలయ్యాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. చివరికి విజయం శ్రీకాంత్​నే వరించింది.

శ్రీకాంత్.. ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగిన సింగపూర్ ఓపెన్​లో చివరగా క్వార్టర్స్​కు చేరాడు.

మరో షట్లర్ ప్రణయ్ రెండో రౌండ్​లో ఓడిపోయాడు. ఇండోనేసియాకు చెందిన జొనాథన్ క్రిస్టి చేతిలో 12-21, 19-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు.

ఇదీ చదవండి: భారత్ బౌలర్లు భేష్​.. 150కే కుప్పకూలిన బంగ్లాదేశ్

ABOUT THE AUTHOR

...view details