తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సింధు ఫైనల్​ ఫోబియాకు కారణమిదే' - Sindhu's final phobia

సింధు, శ్రీకాంత్ శారీరకంగా మరింతగా శ్రమించాలని అంటున్నాడు మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. ఫైనల్​ వరకూ వెళ్లాలంటే ఒత్తిడిని జయించాలని సూచించాడు.

గోపీచంద్

By

Published : Jul 28, 2019, 5:30 AM IST

గోపీచంద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

పుల్లెల గోపీచంద్.. బ్యాడ్మింటన్‌లో దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులను తీర్చిదిద్దిన ప్రముఖ శిక్షకుడు​. సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్ లాంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించే స్థాయికి వారిని తీర్చిదిద్దాడు. తాజాగా ఈటీవీ భారత్​తో మాట్లాడిన గోపీచంద్ పలు విషయాలు వెల్లడించాడు.

కొంత కాలంగా ఫైనల్​ మ్యాచ్​ల్లో ఓడిపోతూ నిరాశపరుస్తోన్న సింధు మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు గోపీచంద్. క్వార్టర్​ ఫైనల్​, సెమీస్​లో గట్టి పోటీ ఎదురయ్యే సరికి సింధు తుదిపోరులో శారీరకంగా అలసిపోతుందని తెలిపాడు. ఒత్తిడిని తట్టుకోలేక ఫైనల్లో ఓడిపోతోందని అన్నాడు. వీటన్నింటిని అధిగమించి భవిష్యత్తులో రాణిస్తుందని చెప్పాడు.

కిదాంబి శ్రీకాంత్​ చాలా టోర్నీల్లో స్థిరత్వం లోపించి క్వార్టర్​ ఫైనల్లో ఓడిపోయాడని​ గోపీచంద్ తెలిపాడు. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంక్​లో ఉన్న ఈ ఆటగాడు మరింతగా రాటుదేలాలని అన్నాడు. శ్రీకాంత్ శారీరకంగా మరింతగా శ్రమించాలని సూచించాడు.

భవిష్యత్తులో సైనా, సింధు కలిసి యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు గోపీచంద్.

ABOUT THE AUTHOR

...view details