తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాడ్మింటన్​ టాప్​-100లో లక్ష్యసేన్​, రియా - saina, lakshya sen, riya mukarjee

తాజా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్​ల్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్​, పీవీ సింధులు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. లక్ష్యసేన్​, రియా ముఖర్జీలు టాప్​-100లోకి వచ్చారు.

టాప్ 100లో  లక్ష్యసేన్, రియా

By

Published : Mar 20, 2019, 5:17 AM IST

Updated : Mar 20, 2019, 8:26 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్​) తాజా ర్యాంకింగ్స్​లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్​, పీవీ సింధులు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. సింధు 6, సైనా తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత యవ షట్లర్లు లక్ష్యసేన్, రియా ముఖర్జీలు టాప్​-100లోకి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్​లో 28 ర్యాంకులు మెరుగుపరుచుకున్న లక్ష్యసేన్...74వ స్థానంలో కొనసాగుతున్నాడు. రియా మహిళల విభాగంలో 19 ర్యాంకులు దాటి 94వ స్థానంలో ఉంది.

మహిళలు...

  1. మహిళల సింగిల్స్​లో స్టార్ షట్లర్లు సింధు, సైనా నెహ్వాల్ వరుసగా ఆరు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు.
  2. చైనీస్ తైపీకి చెందిన తైజుంగ్ మొదటి స్థానంలో ఉంది.

పురుషులు..

  1. పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్ 7వ ర్యాంకులో ఉన్నాడు. సమీర్ వర్మ 14, హెచ్ ఎస్ ప్రణయ్ 24వ స్థానంలో కొనసాగుతున్నారు.
  2. జపాన్ క్రీడాకారుడు కింటో మొమొటో అగ్రస్థానంలో ఉన్నాడు.

డబుల్స్​....

  1. మహిళల డబుల్స్​లో అశ్వినీ పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడి 23 స్థానంలో నిలిచారు. మిక్స్​డ్​ విభాగంలో అశ్వినీ- సాత్విక్​ 24వ ర్యాంకుతో సరిపెట్టుకున్నారు.
  2. పురుషుల డబుల్స్​లో సాత్విక్​ , చిరాగ్​ శెట్టి జోడి 24వ స్థానంలో ఉన్నారు.
Last Updated : Mar 20, 2019, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details