తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాడ్మింటన్​ స్కోరు లెక్కింపులో మార్పులు!

త్వరలో బ్యాడ్మింటన్​ పోటీలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి! స్కోరు లెక్కింపులో మార్పులు చేస్తుండటమే ఇందుకు కారణం. ఇంతకీ ఇందులో ఏం మార్చబోతున్నారు?

BWF to propose change in scoring system in annual meeting
బ్యాడ్మింటన్​ స్కోరు లెక్కింపులో మార్పులు!

By

Published : Apr 3, 2021, 7:05 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్​లో సరికొత్త మార్పులు రానున్నాయి. మ్యాచ్​లో ఆటగాళ్ల స్కోరును లెక్కించడంలో భాగంగా ఇప్పటివరకు 'మూడు గేమ్స్​లో తలో 21 పాయింట్లు' ఉన్నది కాస్త 'ఐదు గేమ్స్​లో తలో 11 పాయింట్లు​'గా మారే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి.

మే 22న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ఈ ప్రతిపాదనను తీసుకురానుంది. దీనితో పాటే పలు ప్రపోజల్స్​ను ఈ భేటీలో చర్చించనున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్)

ఈ ప్రతిపాదనను బీడబ్ల్యూఎఫ్.. కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లిందని, దీనిపై ఓటింగ్ మే నెలలో జరుగుతుందని ప్రపంచ క్రీడా పాలకమండలి చెప్పింది.

అయితే ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్ లార్సెన్ చెప్పారు. ఈ మార్పు.. ఆటలో ఆసక్తిని పెంచి, వాటాదారుల్ని, అభిమానులుకు ఉత్తేజాన్ని తీసుకొస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details