తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాడ్మింటన్​ టాప్​-10​ ర్యాంకింగ్స్​లో సాత్విక్​-చిరాగ్​

భారత బ్యాడ్మింటన్ డబుల్స్​ జోడీ సాత్విక్​ సాయిరాజు-చిరాగ్​శెట్టి..  కెరీర్​లో అత్యుత్తమ ర్యాంక్​ అందుకున్నారు. తాజాగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్​​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో.. టాప్​-10లో చోటు దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష  జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు.

కెరీర్​ బెస్ట్​ ర్యాంకింగ్స్​లో సాత్విక్​-చిరాగ్​

By

Published : Nov 13, 2019, 6:56 AM IST

థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ దక్కించుకుని చరిత్ర సృష్టించిన భారత యువ జోడీ సాత్విక్​ సాయిరాజు-చిరాగ్​శెట్టి.. తాజా ప్రపంచ బ్యాడ్మింటన్(బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. మంగళవారం విడుదలైన ఈ జాబితాలో వీరిద్దరి జోడీ డబుల్స్‌లో ఏడో ర్యాంక్‌కు చేరుకుంది.

ఇటీవల చైనా ఓపెన్​లో వీరిద్దరూ సెమీఫైనల్​కు చేరడం వల్ల.. తొమ్మిదో స్థానం నుంచి కెరీర్​ అత్యుత్తమ ర్యాంక్​కు చేరుకున్నారు. టాప్​-10లో నిలిచిన తొలి పురుషుల డబుల్స్​ జోడీగా రికార్డులకెక్కారు. మొత్తంగా ఈ ఘనత సాధించిన మూడో జోడీగా నిలిచారు. వీరి ద్వయం కంటే ముందు గుత్తా జ్వాల-దిజు వలియవీటిల్​, గుత్తా జ్వాల-అశ్వినీ పొన్నప్ప.. గతంలో టాప్​-10లో చోటు దక్కించుకున్నారు.

ఈ ఏడాది అదుర్స్​..

  • ఈ ఏడాది థాయ్​లాండ్​ సూపర్​ 500 టోర్నీలో విజేతలైన సాత్విక్​-చిరాగ్​... ఆ టోర్నీలో మాజీ ఛాంపియన్లు లీ జున్​ హుయ్​-యు చెన్​(చైనా)లను ఓడించారు.
  • సూపర్​ 750 టోర్నీ... ఫ్రెంచ్​ ఓపెన్​లో ప్రపంచ నెం.6 జోడీ హిరోయికి-యుటా వటానబే జోడీకి చెక్​ పెట్టారు. ప్రపంచ నెం.2 జోడీ హెండ్రా సెతియవన్​-మహ్మద్​ అహ్సన్​(జపాన్​)కు షాకిచ్చారు.
  • ఇటీవల జరిగిన సూపర్​ 750 టోర్నీ... చైనా ఓపెన్​లో సెమీఫైనల్​కు చేరి సంచలనం సృష్టించారు.

నవంబర్​ 12(మంగళవారం) నుంచి సూపర్​ 500 టోర్నీ.. హాంకాంగ్​ ఓపెన్​లో సాత్విక్​-చిరాగ్​ ఫేవరెట్​ జోడీగా బరిలోకి దిగుతున్నారు.

సాయి ప్రణీత్​ ఒక్కడే..

ప్రపంచ ఛాంపియన్​షిప్​ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్​.. పురుషుల సింగిల్స్​ విభాగంలో టాప్​-10లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు. ఇంతటి అత్యుత్తమ ర్యాంక్​ సాధించిన ఏడో ఆటగాడిగా సాయి చరిత్ర సృష్టించాడు.

గతంలో ప్రకాశ్​ పదుకొణె, పుల్లెల గోపీచంద్​, చేతన్​ ఆనంద్​, పారుపల్లి కశ్యప్​, శ్రీకాంత్​ కిదాంబి, హెచ్​ఎస్​ ప్రణయ్​ టాప్​-10 జాబితాలో చోటు పొందారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details