ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్).. ముగ్గురు ఇండోనేషియా షట్లర్లపై జీవితకాల నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, ఫలితాల్ని తారుమారు చేయడంలో పాలుపంచుకోవడమే ఇందుకు కారణమని పేర్కొంది.
ముగ్గురు షట్లర్లపై జీవితకాల నిషేధం - badminton latest news
నియమాలు అతిక్రమించి ఫిక్సింగ్‌కు సహకరించిన ముగ్గురు ఇండోనేషియన్ షట్లర్లపై లైఫ్ బ్యాన్ విధించారు. 21 రోజుల్లో దీనిపై అప్పీలు చేసుకోవచ్చని తెలిపింది.
ముగ్గురు షట్లర్లపై జీవితకాల నిషేధం
మొత్తం ఎనిమిది మందిలో ముగ్గురిపై నిషేధం విధించగా, మిగతా ఐదుగురిని ఆరు నుంచి 12 ఏళ్లపాటు బ్యాన్ చేయడం సహా 3 వేల నుంచి 12 వేల యూఎస్ డాలర్లను జరిమానా విధించింది. ఈ విషయమై ఆటగాళ్లు 21 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.
ఇవి చదవండి:ప్రాక్టీస్‌కు గంట సరిపోతుందా?- సైనా అసహనం