కోచ్‌ల శిక్షణా నైపుణ్యాలను పెంచేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్), బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ఓ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాయి. అయితే గురువారం బ్యాడ్మింటన్ కోచ్‌లు ఈ ట్రైనింగ్‌లో ఉండగా అందరి ముందు ఒక్కసారిగా పోర్న్ చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మహిళా కోచ్‌లు కూడా ఉండటం వల్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ నేతృత్వం వహిస్తున్నారు. విదేశీ కోచ్‌లైన అగుస్ ద్వి సంటోసో, నమ్రీ సురొటోలతో పాటు మొత్తం 700 మంది ఇందులో శిక్షణ తీసుకుంటున్నారు. మొత్తం వారానికి ఐదు రోజుల చొప్పున మూడు వారాల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగనుంది.