తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సింధుతో పెళ్లి చేస్తారా? లేక ఆమెను కిడ్నాప్ చేయాలా?' - బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు

తమిళనాడు రామనాథపురం జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో అధికారులకు ఓ వింత అనుభవం ఎదురైంది. బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ.. ఓ 70 ఏళ్ల వ్యక్తి అర్జీ పెట్టుకున్నాడు. సింధుతో వివాహం చేయకుంటే ఆమెను కిడ్నాప్​ చేసైనా పెళ్లి చేసుకుంటానని చెప్పడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

'సింధుతో పెళ్లి చేస్తారా? లేక ఆమెను కిడ్నాప్ చేయాలా?'

By

Published : Sep 18, 2019, 10:38 AM IST

Updated : Oct 1, 2019, 1:01 AM IST

'సింధుతో పెళ్లి చేస్తారా? లేక ఆమెను కిడ్నాప్ చేయాలా?'
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. వృద్ధుడి వింత కోరికతో కలెక్టర్‌ తో పాటు అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

తమిళనాడులోని రామనాథపురం జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసి సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

జిల్లాలోని విరతకులం గ్రామానికి చెందిన మలైస్వామి అనే వృద్ధుడు పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ అర్జీ పెట్టుకున్నాడు. ఆ పిటిషన్​లో తన వయసు కేవలం16 ఏళ్లని.. తాను 2004 ఏప్రిల్​ 4న పుట్టానని పేర్కొన్నాడు. ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధమని తెలిపాడు. సింధు ఆట తీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను జతచేశాడు.

విమర్శలు ఎదురవుతున్నా.. మలైస్వామి మాత్రం సింధుతో తన పెళ్లి చేయాల్సిందేనని పట్టు పడుతున్నాడు.

ఇదీ చూడండి: భారత్​ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు

Last Updated : Oct 1, 2019, 1:01 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details