భారత్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఇతర దేశాల సమాఖ్యలను కోరింది. ఇటీవలి షూటింగ్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ షూటర్లకు భారత్ వీసాలు నిరాకరించడంపై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ గానీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ గానీ స్పందించలేదు.
భారత రెజ్లింగ్‌తో కటీఫ్ - world
భారత రెజ్లింగ్ సమాఖ్యతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఇతర నేషనల్ ఫెడరేషన్లను కోరింది.
ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ... భారత్‌లో ఎలాంటి ప్రపంచస్థాయి టోర్నీలకు అవకాశం ఇవ్వరాదని తెలిపింది. ఒలింపిక్స్, ఇతర టోర్నీలు నిర్వహించడానికి వీలు లేకుండా పోయింది. తాజాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కూడా భారత రెజ్లింగ్‌కు వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లర్లపై ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది చూడాలి.
పుల్వామా దాడి నేపథ్యంలో దిల్లీలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో పాక్ క్రీడాకారులకు వీసాలు నిరాకరించిన సంగతి తెలిసిందే. బల్గేరియాలో జరిగిన దాన్ కోలోవ్ ఈవెంట్లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. బజరంగ్ పునియా, పుజా ధండా బంగారు పతకాలు... సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ రజత పతకాలతో మెరిశారు.