తెలంగాణ

telangana

ETV Bharat / sports

2020 టోక్యో ఒలింపిక్స్ జ్యోతి ఎలా ఉందో తెలుసా..? - టోక్యో ఒలింపిక్​ జ్యోతి

టోక్యో ఒలింపిక్స్​ నిర్వాహకులు ఒలింపిక్​ జ్యోతి డిజైన్​ను విడుదల చేశారు. చెర్రీ పువ్వు ఆకారంలో ఈ టార్చ్​ను రూపొందించారు.

2020 టోక్యో ఒలింపిక్స్ జ్యోతి ఎలా ఉందో తెలుసా..???

By

Published : Mar 21, 2019, 6:41 PM IST

ఒలింపిక్​ జ్యోతిని జపాన్ దేశ సంప్రదాయంలో సకుర లేదా చెర్రీ బ్లోసమ్​ ఆకారంలో తయారుచేశారు. బుల్లెట్​ ట్రైన్​కు ఉపయోగించిన ప్రత్యేకమైన టెక్నాలజీతో టార్చ్​ అంచులను నిర్మించారు.

  • ఈ గులాబీ టార్చ్​ 71 సెంటీమీటర్ల పొడవు, ఒక కిలో 20 గ్రాముల బరువు ఉండనుంది. 2011 సునామీలో శిథిలమైన గృహాల నుంచి సేకరించిన అల్యూమినియంతో దీన్ని తయారు చేయడం విశేషం.
  1. ఒలింపిక్​ టార్చ్​ రిలే మార్చి 26, 2020లో ఫుకుషిమా నుంచి ప్రారంభంకానుంది. అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణం చేసి ఒకినవా ఐస్​లాండ్​ వరకు సాగుతుంది. జులై 10న జపాన్​ రాజధానికి టార్చ్ తిరిగి​ చేరుకుంటుంది.
  2. 2020 ఒలింపిక్స్​ను పునఃనిర్మాణ (రీకన్​స్ట్రక్షన్)​ ఒలింపిక్స్​గా అభివర్ణించింది జపాన్​. విపత్తులు వచ్చినా తట్టుకుని ఎలా అభివృద్ధి చెందామో ప్రపంచానికి చూపించాలని అనుకుంటోంది.

.

ABOUT THE AUTHOR

...view details