సుదీర్ఘ విరామం తర్వాత ఏపీలోని సినిమా థియేటర్లు(Theaters Open), మల్టీప్లెక్సుల్లో సినిమాల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. కొవిడ్ దెబ్బకు గత ఏడాదిన్నరలో కేవలం 4 నెలలే బొమ్మ పడింది. ఈనెల 8 నుంచే థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతిలిచ్చినా ఎక్కడా అవి తెరుచుకోలేదు. ఇవాళ ఇష్క్, తిమ్మరుసు చిత్రాల విడుదల, ఆగష్టు తొలివారంలో మరో 2-3 సినిమాలు క్యూ కట్టడంతో షోలు వేసేందుకు ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. విజయవాడ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో సమావేశమైన అన్ని జిల్లాల ఎగ్జిబిటర్లు.. ప్రదర్శనలకు ఉన్న కష్టనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. టిక్కెట్ ధరలపై తీసుకొచ్చిన జీవో నంబర్ 35పై పెదవి విరిచారు. దీనిపై వ్యతిరేకతను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Theaters Open : సినీ ప్రియులకు శుభవార్త.. నేటి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
ఏపీలో నేటి నుంచి థియేటర్లు(Theaters Open) తెరుచుకోనున్నాయి. రెండు చిన్న సినిమాల విడుదలతో కేవలం 10 శాతం హాళ్లల్లోనే బొమ్మ పడబోతోంది. ప్రభుత్వ రాయితీలు అందకున్నా.. కొవిడ్ నిబంధనల అమలు అదనపు భారమవుతున్నా.. నష్టాన్ని భరిస్తూనే థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధపడుతున్నారు.
నేటి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
అగ్రతారల సినిమాలు లేకపోవడం, 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన, ఓటీటీల హవాతో థియేటర్లు తెరిచినా నష్టాలు తప్పవని ఎగ్జిబిటర్లు అంటున్నారు. తెరిచిన కొన్నాళ్లకే మళ్లీ కరోనా మూడో దశ వస్తే ఇక అంతే సంగతులంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. నేటి నుంచి పది శాతం థియేటర్లే తెరుస్తున్నామని.. ఆగష్టు తొలివారానికి ఈ సంఖ్య 30-40% పెరిగే అవకాశముందని ఎగ్జిబిటర్లు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి :