ఎన్నో వివాదాల నడుమ ఓటీటీలో విడుదలైన ఫేమస్ వెబ్‌సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'(The Family Man 2) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రఖ్యాత ఐఎమ్‌డీబీ(IMDb) టీవీ సిరీస్ ర్యాంకింగ్స్‌లో ఈ సిరీస్‌కు నాలుగో స్థానం దక్కింది. అత్యంత ప్రజాదరణ పొందిన 'ఫ్రెండ్స్'(F.R.I.E.N.D.S), 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'(Game of Thrones) సిరీస్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానానికి చేరుకుంది. అయితే దీని కంటే ముందుగా ఈ ర్యాంకింగ్స్‌లోని తొలి స్థానంలో 'లోకి'(Loki) ఉండగా.. 'స్వీట్ టూత్'(Sweet Tooth), 'మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్'(Mare of Easttown) సిరీస్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సందర్భంగా సిరీస్ దర్శకులు రాజ్&డీకే ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
'ఫ్రెండ్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెనక్కినెట్టిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' - Loki
'ది ఫ్యామిలీ మ్యాన్ 2'(The Family Man) వెబ్‌సిరీస్‌కు మరోసారి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రఖ్యాత ఐఎమ్‌డీబీ టీవీ సిరీస్(IMDb TV Seires Rankings) ర్యాంకింగ్స్‌లో ఈ సిరీస్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని దర్శకులు రాజ్&డీకే(Raj&DK) ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
'ఫ్యామిలీ మ్యాన్ 2'
మనోజ్ బాజ్‌పాయ్(Manoj Bajpayee), ప్రియమణి(Priyamani) ప్రధానపాత్రలు పోషించిన ఈ సిరీస్ మొదటి భాగం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ నటన విశేషంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్ అందించిన విజయోత్సాహంతో 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2ను తెరకెక్కించారు దర్శకద్వయం రాజ్, డీకే. ఇందులో సమంత(Samantha) కీలకపాత్ర పోషించింది.
ఇదీ చూడండి..Arnold: 'రాజకీయాల్లోకి వచ్చాక నన్ను అసహ్యించుకున్నారు!'