Sridevi Drama Company Latest Promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో వచ్చేసింది. 'జబర్దస్త్' యోధ ఓణీల పంక్షన్‌ను ఈసారి 'శ్రీదేవీ..' సెట్లో చేశారు. దీనితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకు అందించారు.
యాంకర్ సుడిగాలి సుధీర్‌కు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన హైపర్ ఆది.. పెళ్లి కూతురిని మెప్పించేందుకు ఒంటి కాలిపై డ్యాన్స్ చేయమని ఛాలెంజ్ విసిరాడు. అది చేసి చూపించగా, రెండు కాళ్లు పైకెత్తి కూడా డ్యాన్స్ చేయాలని కోరాడు. సుధీర్ చేయకపోవడంతో, హైపర్ ఆది తానే చేసి చూపించాడు.