తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిగ్​ బాస్​లో శ్రీముఖి పారితోషికం ఎంతో తెలుసా..? - srimukhi reminuniration in bigg boss

బిగ్​ బాస్ మూడో సీజన్​లో రెండో స్థానంలో నిలిచిన శ్రీముఖి పారితోషికంపై ఆసక్తి నెలకొంది. వారానికి రూ. 7 లక్షల చొప్పున కోటి రూపాయలు పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది.

శ్రీముఖి

By

Published : Nov 6, 2019, 11:11 AM IST

తెలుగునాట బిగ్​ బాస్ షో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలే ఈ కార్యక్రమం మూడో సీజన్ ముగిసింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేత‌గా నిలవగా.. శ్రీ‌ముఖి రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. విజేత రాహుల్ రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ సొంతం చేసుకున్నాడు. అయితే.. శ్రీ‌ముఖి పారితోషికం ఎంత‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. రెండో స్థానంలో నిలిచినా.. ఆమె ఏకంగా కోటి రూపాయ‌ల‌కుపైగానే ప‌ట్టుకెళ్లిపోయిందని సమాచారం.

గెలిచినా, ఓడిపోయినా సెల‌బ్రిటీల‌కు వారానికి ఇంత అంటూ... ఓ పారితోషికాన్ని ఫిక్స్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్‌. ఆ విధంగా శ్రీ‌ముఖికి వారానికి రూ.7 ల‌క్ష‌లుగా ఒప్పందం కుదిరిందట. బిగ్​బాస్ హౌస్‌లో వంద రోజులు ఉన్న శ్రీముఖి ఆ రూపంలో కోటి రూపాయ‌లు ద‌క్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండో స్థానంలో నిలిచినందుకు ఇచ్చే పారితోషికం అద‌నం.

శ్రీముఖి బుల్లితెర‌పై బిజీ యాంక‌ర్‌. ఒక్కో షోకీ క‌నీసం రూ.50 వేలైనా తీసుకుంటుంది. అందుకే.. ఆమెకు ఆ స్థాయిలో పారితోషికం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొన్న వ‌రుణ్ సందేశ్​కీ బాగానే గిట్టుబాటైంద‌ని స‌మాచారం.

ఇదీ చదవండి: '96' తెలుగు రీమేక్ వచ్చేది ఎప్పుడంటే..?

ABOUT THE AUTHOR

...view details