డ్యాన్స్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ఈ షో ప్రసారం అవుతోంది. 25వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ సందడిగా జరిగాయి. 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కమెడియన్ల పంచులు, 'ఢీ' డ్యాన్సర్ల హుషారెత్తించే డ్యాన్సులు, సోషల్‌మీడియా స్టార్స్ సరదా జోకులతో ఎపిసోడ్ సాగింది.
స్టేజ్‌పై ఇంద్రజ డ్యాన్స్.. వావ్ అనాల్సిందే! - Sridevi Drama Company sudigali sudheer
ఈటీవీలో ప్రతివారం ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. ఆద్యంతం వినోదంగా సాగుతూ, ఎపిసోడ్‌పై ఆసక్తిని కలిగిస్తోంది.
.
షోలో భాగంగా ప్రముఖ నటి ఇంద్రజ స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అందరి చూపుల్ని తనవైపు తిప్పుకొన్నారు. ‘మెరిసింది మేఘా మేఘా’ అంటూ ఆమె వేసిన స్టెప్పులు చూసి అందరూ వావ్ అనకుండా ఉండలేకపోయారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత స్టేజ్‌పై మళ్లీ డ్యాన్స్ చేశానని ఆమె చెప్పారు. అనంతరం తోటి నటి లైలాతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షో వేడుకలు పూర్తిగా చూడాలంటే వచ్చే ఆదివారం వరకూ వేచి చూడాల్సిందే.