స్నానం చేస్తే.. ఆరోగ్యంతోపాటు, అందంగా కూడా తయారవుతామని మనకు తెలిసిన విషయమే. అయితే కొంతమంది అదేపనిగా గంటల తరబడి స్నానం చేస్తుంటారు. ఇలా అతిగా స్నానం చేయటం కారణంగా.. చర్మం పొడిగా మారుతుందని ఓ సర్వేలో తేలింది. నీటిలోని కంటికి కనిపించని బ్యాక్టీరియా.. అలా పొడిగా మారిన చర్మం నుంచి శరీరంలోకి వెళ్తుందని అధ్యయనంలో తేలింది.
ఎక్కువ సేపు స్నానం చేస్తే అనారోగ్యమా?
స్నానం చేయటం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనకు తెలుసు. స్నానంతో శరీరంపై చెమట, మురికి పోయి ఫ్రైష్గా ఉంటారు. అంతేకాక రోజూ స్నానం చేయటం వల్ల బరువు తగ్గుతారన్న అధ్యయనాలూ ఉన్నాయి. అయితే.. అతిగా స్నానం చేయటం వల్ల అనారోగ్యం పాలవుతారని ఓ సర్వేలో తేలింది. మరి ఆ వివరాలు తెలుసుకుందామా..?
స్నానం
ఈటీవీలో ప్రసారమవుతూ.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న క్యాష్ ప్రోగ్రామ్లో ఈ ప్రశ్నను వ్యాఖ్యాత సుమ అడిగారు. దీనికి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన 'టక్ జగదీష్' చిత్రబృందం హస్యాస్పదంగా సమాధానమిచ్చారు. ఈ ప్రశ్నకు.. నాని సరైన సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ప్రశ్నలు సంధించారు సుమ. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.
ఇదీ చదవండి:ఏ పని చేస్తే ఎక్కువ కాలం బతుకుతారో తెలుసా?