తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంత డీ-గ్లామర్​ పాత్రకు కంగన ఫిదా - సమంతపై కంగన ప్రశంసలు

ఓటీటీ ప్రేక్షకులను ఎంతో అలరించిన 'ది ఫ్యామిలీ మ్యాన్​' వెబ్​సిరీస్​ సీక్వెల్​ ట్రైలర్​ బుధవారం ప్రేక్షకులముందుకొచ్చి ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులోని సమంత పాత్రకు పలువురు బాలీవుడ్​ తారలు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో సామ్​ నటనపై స్పందించిన కంగనా రనౌత్​.. ఆమెను అభినందించింది.

Kangana Ranaut in awe of Samantha
సమంత డీ-గ్లామర్​ పాత్రకు కంగన ఫిదా

By

Published : May 20, 2021, 4:34 PM IST

'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' ట్రైలర్​ బుధవారం విడుదలైంది. ఇందులో మనోజ్​ బాజ్​పేయ్​ నటనతో పాటు సమంత యాక్షన్​కు విమర్శకులు ప్రశంసిస్తున్నారు. అయితే సమంత తొలిసారి డీ-గ్లామర్​ పాత్ర పోషించడం వల్ల ఈ వెబ్​సిరీస్​పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది. సామ్ నటించిన బోల్డ్​​ పాత్రకు బాలీవుడ్​లోనూ పలువురు తారలు ఫిదా అయ్యారు.

సమంతపై కంగన ప్రశంసలు

ఈ నేపథ్యంలో 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' ట్రైలర్ చూసిన తర్వాత ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​లో బాలీవుడ్​ నటి కంగన రనౌత్​ స్పందించింది. అందులో సామ్​ బోల్డ్​ పాత్రతో పాటు ఆమె నటనను అభినందించింది. ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్​సిరీస్​ జూన్​ 4న అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్​ కానుంది.

ఇదీ చూడండి..జబర్దస్త్: ఆది పంచులు.. లాంతరుతో సుధాకర్

ABOUT THE AUTHOR

...view details