'ప్రేమికులు' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ముంబయి చిన్నది కామ్నా జఠ్మలానీ. మొదటి సినిమాతో అనుకున్నంతస్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఆమె నటించిన మూడో సినిమా 'రణం'తో సూపర్‌హిట్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించారు కామ్నా జఠ్మలానీ.
హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమె నటనకు దూరమయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆమె తిరిగి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షోలో కామ్నా పాల్గొని తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఇందులో భాగంగానే ఒకానొక సమయంలో తాను చైనాకు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో తన వద్ద పాస్‌పోర్ట్ కూడా లేదని.. దాంతో అక్కడ జరిగిన ఓ సంఘటనతో తాను భయానికి లోనయ్యానని.. ఆ తర్వాత మరలా చైనా వైపు చూడలేదని ఆమె అన్నారు.
ఓ ప్రముఖ దర్శకుడు తనను జూనియర్ శ్రీదేవి అనే పిలిచేవారని పేర్కొంటూ ఆమె ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం, కామ్నా కోసం ఓ స్పెషల్ పర్సన్ పంపించిన వీడియో క్లిప్‌ను ఆలీ ప్లే చేసి చూపించగానే ఆమె ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ ఆ వీడియో క్లిప్ పంపించింది ఎవరు? కామ్నా ఏ దర్శకుడితో పని చేయాలనుకుంటున్నారు? ఇలాంటి ఎన్నో విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే వచ్చే వారం ప్రసారం కానున్న 'ఆలీతో సరదాగా' వీక్షించాల్సిందే.
ఇదీ చూడండి..ఆ షూటింగ్లో సదా ఎందుకు ఏడ్చింది?.. తేజ కొట్టారా?