తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇమేజ్​ మారిన తర్వాతే పెళ్లి చేసుకుంటా' - చావు కబురు చల్లగా

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు విచ్చేసిన 'చావు కబురు చల్లాగా' హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి.. వ్యాఖ్యాత అలీతో కలిసి సందడి చేశారు. ఈ క్రేజీ ఎపిసోడ్ మార్చి 29న ప్రసారం కానుంది.

Hero karthikeya interview in alitho saradaga promo
'ఇమేజ్​ మారిన తర్వాతే పెళ్లి చేసుకుంటా'

By

Published : Mar 24, 2021, 2:59 PM IST

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'చావుకబురు చల్లగా' జంట పాల్గొంది. ఈ సందర్భంగా వాళ్లతో ఆలీ చేసిన సంభాషణ నవ్వులు పూయించేలా ఉంది. 'మీ నాన్న ఏం చేస్తుంటారు' అని కార్తికేయను ఆలీ అడగ్గా.. అనుకోకుండా.. 'ఆర్‌ఎక్స్‌100' అని చెప్పి నాలిక్కరుచుకుంటాడు కార్తికేయ.

కార్తికేయను పెళ్లెప్పుడు అని ప్రశ్నించగా.. ఇప్పుడున్న ఇమేజ్‌ను మార్చుకున్నాక చేసుకుంటానని(నవ్వుతూ) చెప్పాడు. ఈ ఎపిసోడ్‌ మార్చి 29న ప్రసారం కానుంది. అయితే.. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆలస్యమెందుకు చూసేయండి మరి..!

ఇదీ చూడండి:శరవేగంగా 'ఖిలాడి' షూటింగ్​.. 'లవ్​స్టోరి' లిరికల్​ వీడియో

ABOUT THE AUTHOR

...view details