'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌కు ఆ జాబితాలో అగ్రస్థానం - స్కామ్ 1992 ఐఎమ్‌డీబీ రేటింగ్
'స్కామ్ 1992' వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తుంది. ఈ ఏడాది విడుదలైన వెబ్ సిరీస్‌లలో ఐఎమ్‌డీబీ రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా దీనిని రూపొందించారు.
రేటింగ్‌లో అగ్రస్థానానికి చేరిన 'స్కామ్ 1992'
By
Published : Dec 9, 2020, 5:05 PM IST
|
Updated : Dec 9, 2020, 5:20 PM IST
హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తీసిన 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ' వెబ్ సిరీస్ ఐఎమ్‌డీబీలో ఘనత సాధించింది. మన దేశంలో ఈ ఏడాది విడుదలైన సిరీస్‌లలో అత్యధిక రేటింగ్స్ దక్కించుకున్న టాప్-10లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహించారు.
స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్‌ను ఉన్నతస్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాడు. అనంతర కాలంలో జరిగిన అతడి పతనమే ఈ వెబ్ సిరీస్ కథాంశం. హర్షద్ జీవితానికి సంబంధించిన అంశాలను చూపించడంలో దర్శకుడు హన్సల్ మెహతా విజయం సాధించారనే చెప్పాలి. హర్షద్ మెహతా పాత్ర పోషించిన ప్రతీక్ గాంధీ.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
టీవీ షోలతో పాటు వెబ్‌సిరీస్‌లకు ప్రముఖ ఐఎమ్‌డీబీ వచ్చిన రేటింగ్స్ (10 పాయింట్లకు):
స్టార్ బ్రోకర్ హర్షద్ మెహతా బయోపిక్ 'స్కామ్ 1992'.. అత్యధికంగా 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఆల్‌టైమ్ ఐఎమ్‌డీబీ టాప్-250లోనూ చోటు దక్కించుకుంది. టీవీ సిరీస్‌ల ఈ జాబితాలో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'పంచాయత్' రెండో స్థానంలో.. డిస్నీ+హాట్‌స్టార్ సిరీస్ 'స్పెషల్ ఓప్స్' మూడో స్థానంలో నిలిచాయి.