ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గుణ 369'.. ఆదివారం(అక్టోబరు 18) సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. హీరో కార్తికేయ, ఇందులో తన చక్కని నటనతో ఆకట్టుకున్నారు. వీటిలో సినిమా గురించిన మరిన్ని సంగతులు మీకోసం.
"మన వల్ల పక్కవాడి జీవితానికి ఏ హాని జరగకూడదు.. ఒకవేళ జరిగింది అంటే అది పొరపాటు కాదు నేరం. పొరపాటును క్షమించొచ్చు కాని నేరాన్ని శిక్షించాల్సిందే", "గొడవపడితే మిగిలేది ఏం ఉండదు ఒక్క గొడవ తప్ప" డైలాగ్లు సినిమా కథాంశాన్ని తెలియజేస్తున్నాయి.
గుణ 369 సినిమాలో కార్తికేయ, అనఘ కథేంటి?
ఒంగోలులో ఉండే సాదాసీదా కుర్రాడు గుణ(కార్తికేయ). తన చెల్లినిచ్చి పెళ్లి చేయాలనుకున్న వ్యక్తిని కాపాడాలని ప్రయత్నించి సమస్యల్లో చిక్కుకుంటాడు. అనుకోకుండా విలన్ను చంపి జైలుకు కూడా వెళ్తాడు. విడుదలైన బయటకొచ్చేటప్పటికి తన చెల్లి చనిపోయి ఉంటుంది. ఇంతకీ అసలేం జరిగింది? ఆమె చనిపోవడానికి కారణమేంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇందులో కార్తికేయ సరసన అనఘ హీరోయిన్గా నటించింది. నరేశ్, హేమ, 'రంగస్థలం' మహేశ్ తదితరులు ఇతరపాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన 'బుజ్జి బంగారం' పాట అయితే ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంది.
బోయపాటి శ్రీను దగ్గర శిష్యరికం చేసి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు అర్జున్ జంధ్యాల. ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలను గురువులానే తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. ఇన్ని విశేషాలున్న 'గుణ 369' ఆలస్యం చేయకుండా చూసేయండి మరి.
ఇది చదవండి: