సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్‌ప్రసాద్.. పెళ్లి దుస్తుల్లో కనువిందు చేశారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్' స్కిట్లో భాగంగా నవ్వులు పూయించారు. మరోవైపు రాకేశ్-రోహిణి, ఇమ్మాన్యుయేల్-వర్ష జోడీ కితకితలు పెట్టించారు.
సుధీర్-శీను-రాంప్రసాద్ పెళ్లిగోల.. కంటతడి పెట్టించిన జీవన్ - immanuel varsha
ప్రతివారం ఈటీవీలో ప్రసారమయ్యే 'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. సుడిగాలి సుధీర్ టీమ్ పంచులు నవ్వించగా, చాలారోజుల తర్వాత తిరిగొచ్చిన జీవన్.. కంటతడి పెట్టించాడు.
సుధీర్-శీను-రాంప్రసాద్
పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందిన కమెడీయన్ జీవన్.. తిరిగి 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో సందడి చేశాడు. రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లొచ్చినట్లు పేర్కొన్నాడు. 'జబర్దస్త్' నటులు అందరూ కలిసి తనను ఆదుకున్నారని తెలిపాడు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్.. జులై 16న ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. అంతులో ఈ ప్రోమో చూసేయండి.
ఇవీ చదవండి:
Last Updated : Jul 12, 2021, 9:08 PM IST