తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dhee promo: ఈసారి ఒక్క టికెట్​పై నాలుగు సినిమాలు! - ఢీ షో సుధీర్ ప్రదీప్ కామెడీ

Dhee 14: ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే 'ఢీ' డ్యాన్స్ షో సరికొత్త సీజన్​తో మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన కొత్త ప్రోమో ప్రేక్షకులను తెగ అలరిస్తోంది.

dhee latest promo
ఢీ యాంకర్ ప్రదీప్

By

Published : Dec 11, 2021, 4:23 PM IST

Dhee latest promo: 'ఢీ13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' డ్యాన్స్​ షో చివరి ఎపిసోడ్​ ఈ మధ్యే జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ స్పెషల్​ గెస్ట్​గా వచ్చి తెగ సందడి చేశారు. దీంతో కొత్త సీజన్​ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్​ ముందుకు సరికొత్త ప్రోమో తీసుకొచ్చారు.

ఢీ కొత్త సీజన్​లో లక్ష్య మూవీ టీమ్

'ఢీ 14: డ్యాన్సింగ్ ఐకాన్'గా ఈ సీజన్​కు పేరు పెట్టారు. ఈసారి జూనియర్స్, లేడీస్, జోడీస్, ఛాంపియన్స్​.. ఇలా నాలుగు విభాగాలు కలిపి ఒకే సీజన్​లో చూపించబోతున్నారు. యాంకర్​గా ప్రదీప్​.. టీమ్​ లీడర్లుగా హైపర్ ఆది, 'బిగ్​బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపించారు. జడ్జిలుగా ప్రియమణి, గణేశ్ మాస్టర్ ఉన్నారు.

తొలి ఎపిసోడ్​కు 'లక్ష్య' హీరోహీరోయిన్లు నాగశౌర్య, కేతిక శర్మ విచ్చేసి సందడి చేశారు. అలానే డ్యాన్సర్​ తేజస్వినితో కలిసి హిప్​ మూమెంట్​ చేసిన హైపర్ ఆది తెగ నవ్వించారు. ఈ పూర్తి ఎపిసోడ్ డిసెంబరు 15న ప్రసారం కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details