దసరా పండక్కి ఈసారి ఈటీవీలో ప్రోగ్రాం(etv dasara event 2021) అదిరిపోయే రేంజ్లో ప్లాన్ చేశారు. ప్రోమోలు చూస్తే చాలు ఇది అర్ధమైపోతుంది. బుధవారం వచ్చిన కొత్త ప్రోమో(etv dasara programme promo) అందుకు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఇందులోనూ రకరకాల స్కిట్లు, డ్యాన్స్‌లు చేసి, టీవీ ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నారు.
'మాయాబజార్'ను(mayabazar movie) ఈసారి దసరా ప్రోగ్రాం కోసం రీక్రియేట్ చేశారు. గెటప్ శ్రీను కృష్ణుడిగా, శేఖర్ మాస్టర్ అభిమన్యుడిగా, రోజా శశిరేఖగా, శకునిగా హైపర్ ఆది(hyper aadi jabardasth), కౌరవులుగా ఆటో రాంప్రసాద్ టీమ్, ఘటోత్కచుడిగా బుల్లెట్ భాస్కర్ కనిపించనున్నారు. వీరందరూ కలిసి చేసిన స్కిట్ ఆకట్టుకుంటోంది.
ఇమ్మాన్యుయేల్-వర్ష(varsha jabardasth) గొడవపడి.. రోజా దగ్గరకు వచ్చారు. ఆమె ఏం పరిష్కారం చెప్పిందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.