తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుమపై కేసు పెడతానన్న రాఘవేంద్రరావు.. ఏమైంది? - రాఘవేంద్రరావు తాజా వార్తలు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, యాంకర్ సుమపై ఫైర్ అవ్వటం చూశారా? సుమపై ఏకంగా కేసు పెడతానని అన్నారు. మరి ఈ వివాదం ఏంటి? దర్శకేంద్రుడు సీరియస్​ కావడానికి కారణమేంటి?

raghavendra rao
రాఘవేంద్రరావు

By

Published : Sep 29, 2021, 2:16 PM IST

ఎప్పుడూ సౌమ్యంగా ఉండే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao Movies) ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అదీ బుల్లితెర టాప్​ యాంకర్​పైన. అవును.. సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'క్యాష్' ప్రోగ్రామ్​కు(Cash Program Latest Promo) 'పెళ్లిసందD' చిత్ర బృందం.. రోషన్​, శ్రీలీల, దర్శకురాలు గౌరీ రోణంకి వచ్చారు. వీరితోపాటు సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన డైరెక్టర్ రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అయితే.. ఎప్పటిలాగే ఈ ప్రోగ్రామ్ సుమ పంచులతో సరదాగా సాగినా.. షో మధ్యలో రాఘవేంద్రరావు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. 'ఈ షో మొత్తం చీటింగ్' అని కోప్పడ్డారు. 'క్యాష్ ప్రోగ్రాం(Cash Program Latest Promo) అంటే డబ్బులొస్తాయని వచ్చామని.. కానీ ఇక్కడ అలా లేద'న్నారు. తాను వెళ్లిపోతున్నానని అన్నారు.

ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా ఇంతమందిని ఫూల్స్​ను చేస్తారా? అంటూ రాఘవేంద్రరావు సీరియస్ ​అయ్యారు. మా టీం అంతా ఎందుకు పనికిరారా? అని యాంకర్ సుమను ప్రశ్నించారు. షో మధ్యలోనే లేచి వెళ్లిపోయారు రాఘవేంద్రరావు(Raghavendra Rao Movies).

ఈ ప్రోగ్రాం(Cash Program Latest Promo) పూర్తి ఎపిసోడ్ అక్టోబరు 2 రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. అంతవరకూ ఈ ప్రోమో చూసేయండి.

ఇదీ చదవండి:'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'

ABOUT THE AUTHOR

...view details