జడ్జి కుర్చీలో కూర్చుని డ్యాన్సర్లకు తప్పొప్పులు చెప్పే గణేశ్ మాస్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకొని ఉద్వేగానికి గురయ్యారు. ఎందుకో తెలియాలంటే వచ్చే బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ13' చూడాల్సిందే. అదిరిపోయే డ్యాన్సులతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రతివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కార్యక్రమం 'ఢీ13'. వచ్చే వారం అన్ని రకాల మేళవింపులతో వినోదం వడ్డించేందుకు సిద్ధంగా ఉంది. ఒకే టికెట్‌పై ఆరు సినిమాలు చూసేందుకు మీరూ సిద్ధమైపోండి.
ఈసారి కంటెస్టెంట్లు మాత్రమే కాదు.. టీమ్‌లీడర్లు, జడ్జిలు కూడా స్టేజీ మీద అదరగొట్టే పెర్ఫార్మెన్సులు ఇచ్చి వారెవ్వా అనిపించనున్నారు. 'జై లవకుశ'లో జైగా యాంకర్ ప్రదీప్, 'అరుంధతి'లో అరుంధతిగా పూర్ణ, 'మగధీర'లో మిత్రవిందగా ప్రియమణి, కాలభైరవగా ఆది, 'జానీ'గా గణేశ్ మాస్టర్, 'ఇంద్ర'గా సుధీర్, 'ఏమాయ చేశావే'లో జెస్సీగా రష్మీ కనిపించి సందడి చేయనున్నారు. వీటితో పాటు ఢీ అంటే ఢీ అనేలా 'కింగ్స్ వర్సెస్ క్వీన్స్' కంటెస్టెంట్లు డ్యాన్సులు అదరగొట్టారు.