'ఢీ 13'(Dhee Latest Promo) డ్యాన్స్ షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఓవైపు డ్యాన్సులు, మరోవైపు సుధీర్, ఆది, ప్రదీప్ చేసిన కామెడీ(Sudigali Sudheer Skits) ఆద్యంతం అలరిస్తోంది. పెళ్లికొడుకుల్లా తలకు భాజకం కట్టుకొని సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సందడి చేశారు. ఎంట్రీతోనే వీరిద్దరూ పంచ్‌లతో అలరించారు. మరోవైపు రష్మి, దీపిక గ్లామర్‌తో ఆకట్టుకున్నారు.
Dhee Latest Promo: సాఫ్ట్వేర్ ఇంజనీర్స్‌గా సుధీర్, ఆది! - సుడిగాలి సుదీర్ skits
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్‌గా(Sudigali Sudheer Skits) అవతారమెత్తారు. అయితే అది 'ఢీ' షోలో భాగంగా ఓ స్కిట్ కోసమే! దీనికి సంబంధించిన ప్రోమో(Dhee Latest Promo) ఇప్పుడు అలరిస్తోంది.
వీరితో పాటు కంటెస్టెంట్ల డ్యాన్స్ అలరిస్తోంది. ముఖ్యంగా ఇద్దరు లేడీ డ్యాన్సర్లు తమ జడలను కలిపి.. 'చందమామ' సినిమాలోని పాటకు వేసిన స్టెప్పులు అందర్ని ఆశ్చర్యపరిచాయి. స్కిట్లో భాగంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవతారమెత్తారు. ఓ ఐటీ కంపెనీలో వీరితో పాటు రష్మి, దీపిక కూడా పనిచేస్తుంటారు. వీరి మధ్య జరిగిన సంభాషణలు, పంచ్‌లను ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వీరిపై యాంకర్ ప్రదీప్(Dhee Anchor Pradeep) వేసిన పంచులు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. పూర్తి ఎపిసోడ్ సెప్టెంబరు 29న ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.
ఇదీ చూడండి..సుడిగాలి సుధీర్ అసిస్టెంట్‌గా హైపర్ ఆది!