తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బిగ్‌బాస్‌' హౌస్‌లో పెళ్లిసందడి.. ప్రియ కంటతడి - బిగ్ బాస్ న్యూస్

బిగ్​బాస్​ హౌస్​లో పెళ్లిసందడి మొదలైంది. 'హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి' అనే టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీనికి సంబంధించిన ప్రోమో అలరిస్తోంది. దాన్ని మీరూ చూసేయండి..

bigboss
బిగ్​బాస్

By

Published : Sep 21, 2021, 9:39 PM IST

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'(Bigg Boss 5 Telugu). నాగార్జున వ్యాఖ్యాతగా 'బిగ్‌బాస్‌ సీజన్‌-5'(Bigg Boss Telugu Latest News) ప్రసారమవుతోంది. మూడోవారానికి సంబంధించి నామినేషన్స్‌ ప్రక్రియ సోమవారం అసంపూర్తిగా ముగిసింది. ప్రియ చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. రవి తనను ఏదో అన్నాడని ప్రియ బాధపడింది. 'నేను చూసింది, విన్నదే మాట్లాడాను. నేనేదీ కల్పించి మాట్లాడలేదు. నువ్వు ఎలా అయితే నన్ను పెంచావో నేను అలానే ఉన్నా అమ్మా' అంటూ కంటతడి పెట్టుకుంది. నేడు ప్రసారంకానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో చెప్పిన సంగతులివి.

మరోవైపు.. పెళ్లి నేపథ్యంలో 'హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి' అనే టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి, అమ్మాయి మామయ్యగా రవి, అమెరికా నుంచి తిగిరివచ్చిన అబ్బాయిగా శ్రీరామ్‌, ఈ అబ్బాయి మాజీ గాళ్‌ ఫ్రెండ్‌గా హమీదా, పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తిగా షణ్ముఖ్‌ సందడి చేయనున్నారు. ఈ హంగామా అంతా చూడాలంటే కొన్ని క్షణాలు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోలు చూసి ఆనందించండి..

ఇదీ చదవండి:వామ్మో! బిగ్‌బాస్‌కు సల్మాన్‌ పారితోషికం అంతనా?

ABOUT THE AUTHOR

...view details