తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ హీరో అనుకుని నన్ను ఆడిషన్​కు పిలిచారు' - నవీన్​ పొలిశెట్టి అనుదీప్

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' సెలబ్రిటీ టాక్ షోలో 'జాతిరత్నాలు' సందడి చేశారు. హీరో నవీన్ పోలిశెట్టితో పాటు దర్శకుడు అనుదీప్​.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

alitho saradaga naveen polishetty interview
'చిచ్చోరే'లో యాసిడ్​ పాత్ర ఆ హీరో చేయాల్సింది!

By

Published : Mar 23, 2021, 10:46 AM IST

రత్నాలు వాడితే రాత మారుతుందో లేదో తెలియదు కానీ.. తెరపై ఈ జాతిరత్నాన్ని చూస్తే మాత్రం నాన్​స్టాప్​ కామెడీతో పొట్ట చెక్కలవుతుంది. స్వయంకృషితో ఎదుగుతూ.. చేసే ప్రతి పాత్రలో తన మార్క్​ ఎంటర్​టైన్మెంట్​తో నవ్విస్తూ.. యువతరంలో యమ క్రేజ్​ తెచ్చుకున్న ఈ కామెడీ రత్నం.. 'జాతిరత్నాలు' చిత్రంతో సూపర్​ డూపర్​ హిట్​ అందుకొన్నారు యువ కథానాయకుడు నవీన్​ పొలిశెట్టి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి దర్శకుడు అనుదీప్​తో పాటు నవీన్​ విచ్చేశారు. వారిద్దరూ ఆలీతో పంచుకున్న విశేషాలెంటో తెలుసుకుందాం.

చిన్నతనం నుంచే నటుడిగా ఎదగాలనేదని తన ఆశయమని యువ కథానాయకుడు నవీన్​ పొలిశెట్టి అన్నారు. 'జాతిరత్నాలు' చేసిన తర్వాత తమకు పెళ్లి జరగదని ఫిక్సయిపోయినట్లు తెలిపారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'జాతిరత్నాలు' సినిమాతో పాటు తన వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు.

దీపిక పేరుతో కిన్వా వ్యాపారం

'కిన్వా' వ్యాపారం ఎలా ఉందని అలీ, నవీన్‌ను అడగ్గా, ఆయన గుక్కతిప్పుకోకుండా చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. 'కిన్వా'ను రెస్టారెంట్లకు అమ్మడానికి దీపికా పదుకొణె పేరు చెప్పి విక్రయించినట్లు నవీన్​ చెప్పారు. అయితే నవీన్​ చెప్పిన సమాధానానికి.. "నువ్వు జాతిరత్నం కాదు.. జాతి ముదురు" అని ఆలీ అన్నారు.

నివీన్​ పౌలీని అనుకున్నారు!

'చిచ్చోరే' సినిమాలో యాసిడ్​ రోల్​ కోసం మలయాళ హీరో నివీన్​ పౌలీని అనుకున్నారట. ఏదో గందరగోళంలో చిత్రబృందం నివీన్​ అనుకొని నవీన్​కు మెయిల్​ చేశారట. అప్పుడు ఆడిషన్​ వీడియో చేసి దర్శకుడికి పంపగా.. అది నివీన్​ కాదని తెలిసి ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత వెరొక సందర్భంలో నవీన్​ చేసిన యూట్యూబ్ వీడియో వైరల్​ అవ్వడం వల్ల 'చిచ్చోరే'లో అవకాశం వచ్చిందని నవీన్​ పొలిశెట్టి చెప్పారు.

విజయ్‌ దేవరకొండతో ఉన్న అనుబంధం, ప్రభాస్‌తో ఉన్న పరిచయం గురించి తన స్టైల్లో ఈ 'జాతిరత్నం' చెప్పుకొచ్చారు. మరో అతిథిగా షోకు విచ్చేసిన డైరెక్టర్‌ అనుదీప్‌ తాను చెప్పులు వేసుకోకపోవడానికి గల కారణం ఏంటో నవ్విస్తూ వివరించారు. ఆ విశేషాలేంటో తెలియాలంటే ఆలీతో సరదాగా చూడాల్సిందే!

ఇదీ చూడండి:'జాతిరత్నాలు' అనుదీప్ చెప్పులేసుకోరు.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details