"ఆ పాటలో ఒరిజినల్ ఐటెమ్ గాళ్ నేనేనండి" అంటూ సందడి చేశారు నటి గౌతమి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారామె. ఈ సందర్భంగా "జెంటిల్‌మెన్' చిత్రంలోని చికుబుకు చికుబుకు రైలే.. అదిరెను దీని స్టైలే పాటలో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. అందులో మీరు అతిథా? ఐటమా?" అని ఆలీ అడగ్గా ఒరిజినల్ ఐటెమ్ గాళ్ నేనేనంటూ నవ్వులు పూయించారు గౌతమి.
'ఆయన చెప్పకుండా మాంసం తినిపించారు' - నటి గౌతమి ఆలీతో సరదాగా
ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'. తాజాగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు నటి గౌతమి. కెరీర్‌తో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో అలరిస్తోంది.
సుబ్బలక్ష్మి పేరు ఇష్టమని అందుకే తన కూతురికి ఆ పేరు పెట్టానని, ఓ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యాక శుభలేఖ సుధాకర్ తనకు క్షమాపణ చెప్పారని (నవ్వుతూ..) ఈ కార్యక్రమంలో తెలియజేశారు గౌతమి. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి నటించే అవకాశం వదులుకున్నారా? అని ఆలీ ప్రశ్నించగా గౌతమి పలికించిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి.
దివంగత నటుడు శివాజీ గణేశన్ చెప్పకుండా తనతో మాంసం తినిపించారని చెప్పుకొచ్చారు గౌతమి. మరి సుధాకర్ ఎందుకు సారీ చెప్పారు? చిరు, బాలకృష్ణతో సినిమా చేయకపోవడానికి కారణం? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఏప్రిల్ 26వ తేదీ రాత్రి 9:30 గంటల వరకు వేచి చూడాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రోమోను చూసి ఆనందించండి.