తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటి కిడ్నీలు ఫెయిల్.. సాయం చేయాలని వినతి - tv actor dead

తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని చెప్పిన టీవీ నటి అనయా సోనీ.. సాయం చేయాలని నెటిజన్లను కోరింది. దాదాపు 20 నిమిషాలున్న వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

actress Anaya Soni seeks financial help as her kidneys fail
అనయా సోనీ

By

Published : Jul 12, 2021, 3:42 PM IST

'నామ్​కరణ్', 'క్రైమ్ పెట్రోల్' లాంటి టీవీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అనయా సోనీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఇదే విషయాన్ని చెబుతూ, తనకు వీలైనంత ఆర్థిక సాయం చేయాలని నెటిజన్లను కోరింది. 20 నిమిషాల వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

అసలు ఏమైంది?

ఆరేళ్ల క్రితం అనయా సోనీ రెండు కిడ్నీలు పాడయ్యాయి. దాంతో ఆమె తండ్రి 2015లో కిడ్నీ దానం చేశారు. అప్పటి నుంచి ఒక్క కిడ్నీతో అనయా జీవనం సాగిస్తోంది. ఈ మధ్య అది కూడా క్షీణించడం వల్ల ఆమె ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం తనకు డయాలసిస్​తో పాటు కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్​ చేయాల్సి ఉందని, కానీ తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కిడ్నీ దాత కోసం వెతుకుతున్నట్లు వెల్లడించింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా తాను ఊహించలేదని భావోద్వేగం చెందింది.

టీవీ నటి అనయా సోనీ

అనయా.. ఇటీవల తెలుగులో 'రుద్రమదేవి' సీరియల్ చేసినట్లు వెల్లడించింది. 'నామ్​కరణ్', 'క్రైమ్ పెట్రోల్' కాకుండా 'ఇష్క్ మైన్ మర్జవాన్', 'సావధాన్ ఇండియా', 'అదాలత్' సీరియళ్లలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 'టేక్ ఇట్ ఈజీ', 'హై అప్నా దిల్​ తో ఆవారా' సినిమాల్లోనూ ఈమె సహాయ పాత్రలు చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details