చిత్రం: పెళ్లి సందD; నటీనటులు: రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ తదితరులు; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని; దర్శకత్వ పర్యవేక్షణ: కె.రాఘవేంద్రరావు బి.ఎ; దర్శకత్వం: గౌరీ రోణంకి; విడుదల: 15-10-2021
ఈసారి దసరాకు అసలు సిసలు సినిమా సందడి కనిపించింది. మూడు కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి.. పెళ్లిసందD(Pelli SandaD Review). పాతికేళ్ల కిందటి 'పెళ్లి సందడి' హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో కథానాయకుడిగా నటించడం.. అప్పటి సినిమాకు దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం, ఆయన ఓ కీలక పాత్రలో కూడా నటించడం ఈ సినిమా ప్రత్యేకం. మరి ఈ నయా సందడి ఎలా ఉంది? పాతికేళ్ల కిందట తండ్రి శ్రీకాంత్ చేసిన సందడిని తనయుడు రోషన్ పునరావృతం చేశాడా?
కథేంటంటే: వశిష్ట (రోషన్) బాస్కెట్ బాల్ ప్లేయర్. ఒక పెళ్ళిలో సహస్ర (శ్రీలీల(pelli sandadi heroine))ని చూసి మనసు పడతాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. కానీ సహస్ర సోదరి(వితిక షేరు)తీసుకున్న ఓ నిర్ణయం ఆ ప్రేమికులు ఇద్దరినీ దూరం చేస్తుంది. తన అక్క జీవితం కోసం తండ్రికి(ప్రకాష్ రాజ్) ఓ మాట ఇస్తుంది సహస్ర. ఇంతకీ ఆ మాట ఏమిటి? కలిసి బతకాలనుకున్న వశిష్ట.. సహస్ర మధ్య బంధం ఏమయ్యింది? వాళ్ళ ఇద్దరి కథ ఎలా ఎవరి ద్వారా బయటకు వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే 'పెళ్లి సందD'(Pelli SandaD Review) అయ్యింది. అంతే తప్ప అప్పటి సినిమాకు.. ఈ కథకీ ఎలాంటి సంబంధం లేదు. మాయ (శివాని రాజశేఖర్) అనే ఓ దర్శకురాలు ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత అయిన వశిష్ట బయోపిక్ తీయాలని అనుకుంటుంది. ఎవరికీ తెలియని ఆయన స్టోరీ తెలుసుకునేందుకు మాయ తండ్రి (రాజేంద్రప్రసాద్) రంగంలోకి దిగుతాడు. అక్కడినుంచి మొదలవుతుందీ సినిమా. కాలం చెల్లిన కథతో ఈ నయా పెళ్లిసందD తెరకెక్కింది. కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు - కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ తప్ప ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. పాత కథను అంతే పాత పద్ధతుల్లో తెరకెక్కించారు. ఫ్యామిలీ స్టోరీ అనుకున్నప్పుడు ఫ్యామిలీని కట్టిపడేసే బంధాలు అనుబంధాలు తెరపై కనిపించాలి. రొమాంటిక్ స్టోరీ అనుకున్నప్పుడు ప్రధాన జోడీ మధ్య ప్రేమ, రొమాన్స్ కనిపించాలి. కానీ ఈ సినిమాలో అవేవీ పండలేదు. నువ్వంటే నాకు, మాయ నగరిలో.. పాటలు అందులో కథానాయిక అందం ఆకట్టుకుంటోంది.
ఎవరెలా చేశారంటే: హీరోహీరోయిన్ల జోడీ చూడ్డానికి ఫ్రెష్‌గా ఉంది. ఇద్దరి మధ్య ముఖ్యంగా పాటల్లో మంచి కెమిస్ట్రీ కనిపించింది. పాత్రల్లో అందం లేకపోవడం వల్ల సన్నివేశాలు తేలిపోయాయి. భావోద్వేగాలు పండలేదు. రాఘవేంద్రరావు(raghavendra rao new movie) తొలిసారి తెరపై కనిపించారు. అంతే తప్ప ఆ పాత్రపై పెద్దగా ప్రభావం చూపించలేదు. పరిశ్రమలో ఉన్న ప్రధాన తారాగణం తెరపై కనిపించింది. కానీ ప్రభావం అంతంత మాత్రమే. సాంకేతికంగా విభాగంలో సంగీతం, నృత్య దర్శకత్వం ప్రధాన పాత్ర పోషించింది. మిగిలిన విభాగాలన్నే తేలిపోయాయి.
బలాలు
+ పాటలు