కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలకు నిధులను సేకరించేందుకు భారతీయ సినీ ప్రముఖులతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కళాకారులైన రోలింగ్ స్టోన్స్ మిగ్ జాగర్, సింగర్-పాటల రచయిత ఎడ్ షీరన్లు ఇందులో పాల్గొననున్నారు. వీరితో పాటు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్లతో పాటు బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, విద్యాబాలన్ కలిసి ఈ కార్యక్రమంలో కనువిందు చేయనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేసి.. రూ.25 కోట్ల విరాళాలను జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చిన మొత్తాన్ని కొవిడ్ నియంత్రణకు ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 'వీ ఫర్ ఇండియా'(ఇండియా కోసం మనం) అనే పేరు ఖరారు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఫేస్బుక్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూడొచ్చు.
ఈ కార్యక్రమంలో ద్వారా వచ్చిన నిధులతో అత్యవసరమైన వారి కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ యూనిట్లలో అవసరమైన మెడిసిన్స్ అందజేయనున్నారు. అంతేకాకుండా ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ సెంటర్లనూ ఏర్పాటు చేయనున్నారు. కరోనా సంక్షోభం ద్వారా ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆహారం సహా నిత్యావసర సరకుల వస్తువులను అందజేయనున్నారు.
3 గంటలు.. 100 మంది కళాకారులు