ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి చాలా డిజిటల్ వేదికల్లో వెబ్‌సిరీస్‌లను వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. మిగతా వాటిలా సిరీస్‌లు చూసేందుకు ప్రీమియం చెల్లించాల్సిన పనిలేకుండా ఇకపై ఉచితంగా అందించనున్నట్టు తన బ్లాగ్‌లో తెలిపింది యూట్యూబ్.
యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్‌లు ఫ్రీగా చూడండి! - kobra kai
వెబ్‌సిరీస్‌లు ఇకమీద ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించింది యూట్యూబ్. కాకపోతే మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి. కొత్త పద్ధతిలో కేవలం కొత్త వెబ్‌సిరీస్‌లు చూసేందుకే అవకాశముంది.

యూ ట్యూబ్
యూట్యూబ్‌లో వచ్చే వెబ్‌సిరీస్‌లు ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించకుండా చూడొచ్చు. అయితే మధ్యలో ప్రకటనలు(యాడ్స్) వస్తాయి. ఇంతకుముందే ప్రీమియం కట్టి చూస్తున్న వెబ్‌సిరీస్‌లకు మాత్రం యాధావిధిగా డబ్బు కట్టాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే సిరీస్‌లను మాత్రమే ఉచితంగా వీక్షించే అవకాశముంది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించే 'కోబ్రా కై' థర్డ్ సీజన్‌ను ఫ్రీగా చూసే అవకాశమిచ్చింది యూట్యూబ్. 'స్టెప్ అప్ హై వాటర్' లాంటి ఇంతకుముందే ఉన్న సిరీస్‌లకు మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.