టాలీవుడ్ యువ కథానాయకులు నితిన్, నిఖిల్ ఒకే రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇద్దరు హీరోలు ప్రేమ వివాహాలే చేసుకోనున్నారు. నితిన్ తన స్నేహితురాలు షాలినితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరు ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం కూడా జరుపుకొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకుంది ఈ యువ జంట. నితిన్ - షాలిని వివాహం ఏప్రిల్ 16న జరగనుందని సమాచారం.
నితిన్.. నిఖిల్ల పెళ్లి ఒకే రోజు..!
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పెళ్లి సీజన్ నడుస్తోంది. అప్పుడే వివాహం ఏంటని ప్రశ్నించే యువ హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కెందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరారు నితిన్, నిఖిల్. వీరిద్దరూ ఒకే రోజు మూడు ముళ్లు వేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.
నితిన్ - నిఖిల్లకు ఒకే రోజు..!
అదే రోజు నిఖిల్ కూడా తన ప్రేయసి పల్లవితో ఏడడుగులు వేయనున్నాడు. ఇటీవలే తన డాక్టర్ ప్రేయసితో నిశ్చితార్థం జరుపుకొన్నాడు నిఖిల్. ఏప్రిల్ 16నే ఆమెకు మూడు ముళ్లు వేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. వీరిలో నితిన్ వివాహం దుబాయ్లో జరగనుంది. ఇక నిఖిల్ వివాహ వేదికపై ఇంకా స్పష్టత రాలేదు.
Last Updated : Mar 1, 2020, 1:01 PM IST