తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓల్డ్​ గెటప్స్​తో అలరించిన మన హీరోలు - young heroes old getups

వయసు పైబడిన హీరోలు యంగ్​గా కనిపించడం మామూలే. కానీ యువ హీరోలు ఓల్డ్ గెటప్​ వేసుకుని నటించడమంటే కాస్త ధైర్యం కావాలి. అలా ఓల్డ్ గెటప్​లో కనిపించిన మన హీరోలను ఓసారి చూద్దాం.

సినిమా

By

Published : Nov 21, 2019, 6:45 AM IST

వయసు పైబడినా సినిమాల్లో యంగ్​గా కనిపించడం మామూలే. కానీ యువ హీరోలు ఓల్డ్​ గెటప్​ వేసుకోవడం అంటే కాస్త ధైర్యం చేయాల్సిందే. క్రేజ్ ఉన్న హీరోలు ఇలాంటి పాత్రలు చేస్తే అది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్​ హీరోలు ఓల్డ్​ గెటప్​లో కనిపించారు. తర్వాత కూడా కొంతమంది ఈ వేషాల్ని ధరించారు. అలాంటి హీరోలపై ఓ లుక్కేద్దాం.

చిరంజీవి - స్నేహం కోసం

మెగాస్టార్ చిరంజీవి డ్యుయర్ రోల్​ చేసిన చిత్రాల్లో స్నేహం కోసం ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ నటనకు ఫిదా అవ్వాల్సిందే. ఓల్డ్​ గెటప్​లో భావోద్వేగ సన్నివేశాల్లో చిరు జీవించాడని చెప్పుకోవచ్చు.

చిరంజీవి

బాలకృష్ణ -పెద్దన్నయ్య, చెన్నకేశవరెడ్డి

ఈ రెండు చిత్రాల్లోనూ బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. రెండింటిలోనూ ఓల్డ్ గెటప్ పాత్రే హైలెట్.

బాలకృష్ణ

వెంకటేశ్ - సూర్యవంశం

ఈ చిత్రంలో హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో వెంకటేశ్ నటన అద్భుతం. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

వెంకటేశ్

మోహన్ బాబు - పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి

మోహన్ బాబు కెరీర్​లో 'పెదరాయుడు' ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. 'రాయలసీమ రామన్న చౌదరి' చిత్రంలో కూడా మోహన్ బాబు ఓల్డ్ గెటప్​తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ క్యారెక్టర్​కు మంచి గుర్తింపు వచ్చింది.

మోహన్​బాబు

రజినీకాంత్ : పెదరాయుడు, ముత్తు, నరసింహా

సూపర్ స్టార్​ రజనీకాంత్ కెరీర్​లో ఈ మూడు చిత్రాలు బ్లాక్​బాస్టర్లుగా నిలిచాయి.

రజనీకాంత్

కమల్ హాసన్ - భారతీయుడు

శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు భారీ హిట్​ను ఖాతాలో వేసుకుంది. ఇందులో సేనాపతి క్యారెక్టర్​లో కమల్​హాసన్​ నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం భారతీయుడు 2లో 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడు కమల్.

కమల్ హాసన్

రాజశేఖర్ - మా అన్నయ్య

ఈ చిత్రంలో రాజశేఖర్​ నటన ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. ఈ హీరో కెరీర్​లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది.

రాజశేఖర్

నాగార్జున : అన్నమయ్య

అన్నమయ్య అనగానే గుర్తొచ్చేది కింగ్ నాగార్జున. ఆ పాత్రలో నాగ్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ముఖ్యంగా ఓల్డ్​ గెటప్​లో అతడి యాక్టింగ్​ చాలా బాగుంటుంది. ఈ పాత్రకు గానూ స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడీ హీరో.

అన్నమయ్య

మహేశ్ బాబు – నాని

అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుగాంచాడు ప్రిన్స్ మహేశ్ బాబు. ఈ హీరో కూడా నాని చిత్రంలో కాసేపు ఓల్డ్​ గెటప్​లో కనిపించి ఆకట్టుకున్నాడు.

మహేశ్ బాబు

రానా – బాహుబలి, బాహుబలి 2

బాహుబలి.. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్​తో పాటు ప్రతినాయకుడు రానాకు మంచి పేరొచ్చింది. ఇందులో ఓల్డ్​ క్యారక్టర్​లో రానా నటన ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుంది.

రానా

సుమంత్ : ఎన్టీఆర్ కథానాయకుడు

ఎన్టీఆర్ బయోపిక్​లో ఏఎన్నార్​గా​ నటించి మెప్పించాడు సుమంత్. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాడు.

సుమంత్

వీరే కాకుండా కార్తీ (ఖాకీ), సుధీర్ బాబు (వీర భోగ వసంత రాయలు), నారా రోహిత్ (అప్పట్లో ఒకడుండేవాడు), శ్రీవిష్ణు (అప్పట్లో ఒకడుండేవాడు) కాసేపు ఓల్డ్​ గెటప్స్​లో మెరిశారు.

ఇవీ చూడండి.. అమ్మాయిల మధ్యలో అల్లు అర్జున్ అలా...

ABOUT THE AUTHOR

...view details