తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమా కోసం నాగశౌర్య సరికొత్త అవతారం - మెహ్రీన్ కౌర్

నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యువహీరో నాగశౌర్య రచయితగానూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. తను హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాకు ఓ సరికొత్త ప్రేమకథను అందించాడు. ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్.

తన కథతోనే సినిమా తీస్తున్న నాగశౌర్య

By

Published : May 11, 2019, 5:09 PM IST

ఊహలు గుసగుసలాడే, ఛలో, కల్యాణ వైభోగమే చిత్రాలతో ఆకట్టుకున్న యువహీరో నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభించాడు. పూజా కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్​లో జరిగింది. దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. డైరక్టర్స్​ పరశురామ్, బీవీఎస్ రవి, నందిని రెడ్డి హాజరయ్యారు.

చిత్ర ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖ దర్శకులు

'ఎఫ్​2'తో హిట్ కొట్టిన మెహ్రీన్ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రంతో రమణ్​ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.​

ఇది చదవండి: శ్రీకాంత్ అడ్డాలతో నేచురల్ స్టార్..!

ABOUT THE AUTHOR

...view details