బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన పార్టీ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో ఆమెపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. విక్రోలీ పోలీస్ స్టేషన్లో నితిన్ మానే అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు. ముంబయిలోనీ కంగన భవనం బీఎంసీ కూల్చివేసిన ఘటనలో సీఎంకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయనడానికి నటి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కంగనా రనౌత్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఠాక్రే కీర్తిని దెబ్బతీయడానికి కంగన ప్రయత్నిస్తోందని ఆ ఫిర్యాదులో ఉంది.
కంగనా
బుధవారం తన ఆఫీసును బీఎంసీ కూల్చడానికి కారణం 'ఠాక్రే' అని నేరుగా సంబోధిస్తూ ఆయనపై కంగన విరుచుకుపడింది. బాలీవుడ్ మాఫియాతో కలిసి తన ఇళ్లు పడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నారని మండిపడింది. 'ఈరోజు నా ఇల్లు కూల్చారు.. రేపు మీ అహంకారం కూలుతుంది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాలమనే చక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదని హెచ్చరించింది.
ఇదీ చూడండి 'రఫేల్ రాకతో వాయుసేన బలం మరింత పెరిగింది'