అనారోగ్యంతో బాధపడుతోన్న తనను ఆదుకోవాలంటూ.. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను సాయం కోరింది సీనియర్ హీరోయిన్ పూజా దద్వాల్. తనకు కరోనా ఉందేమో అని అనుమానం వ్యక్తం చేసింది. వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడానికి తన వద్ద డబ్బులు లేవని వెల్లడించింది.
గతంలో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు సల్మాన్ ఆదుకున్నట్లు తెలిపింది. దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు చికిత్సకు అయిన ఖర్చులన్నీ అతడే భరించినట్లు చెప్పుకొచ్చింది.