ఈ ఏడాది దక్షిణాది నుంచి రాబోతున్న పెద్ద చిత్రాల్లో 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' ఒకటి. ఈ సినిమా తొలి భాగానికి దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభించిన నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.
ఫలక్‌నుమా ప్యాలస్‌లో 'కేజీఎఫ్ 2'..! - Yash KGF 2
యశ్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న దక్షిణాది చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలోని ఓ కీలక ఎపిసోడ్‌ను హైదరాబాద్‌లోని నిజాం కాలం నాటి చారిత్రక కట్టడం ఫలక్‌నుమా ప్యాలస్‌లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పర్యాటక స్థలంగా ఉన్న ఈ ప్యాలస్‌ను ప్రస్తుతం గ్రాండ్ హోటల్‌గా మార్చారు. ఇప్పుడిందులోనే యశ్ మిగిలిన ముఖ్య చిత్ర బృందంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారట.
ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను రవీనా టాండన్ పోషిస్తుండగా.. అధీరా అనే ప్రతినాయక పాత్రలో సంజయ్ దత్ దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర గ్రాఫిక్స్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.