తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Yash KGF 2 Movie: 'కేజీఎఫ్'​ నుంచి స్పెషల్​ వీడియో

Yash KGF 2 Movie: కన్నడ స్టార్​ యశ్​ హీరోగా వచ్చిన 'కేజీఎఫ్'​ చిత్రం విడుదలై నేటితో మూడేళ్లైంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేసింది చిత్రబృందం.

By

Published : Dec 21, 2021, 4:18 PM IST

కేజీఎఫ్​ 2 సినిమా రిలీజ్​ డేట్​, kgf 2 movie release date
కేజీఎఫ్​ 2 సినిమా రిలీజ్​ డేట్​

Yash KGF 2 Movie: కన్నడ స్టార్​ హీరో యశ్‌ నటించిన చిత్రం 'కేజీఎఫ్‌'. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్ట్‌ 'కేజీఎఫ్‌- చాప్టర్‌ 1' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2018లో ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. 'కేజీఎఫ్‌- చాప్టర్‌ 1' విడుదలై నేటికి మూడేళ్లయిన నేపథ్యంలో చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో 'కేజీఎఫ్‌ చాప్టర్‌-1' విడుదల తేదీ ప్రకటన దగ్గర నుంచి 'కేజీఎఫ్‌- చాప్టర్‌2' విడుదల తేదీ ప్రకటన వరకు చిత్రబృందం చేసిన ప్రయాణాన్ని చూపించారు. అంతేకాదు.. థియేటర్లలో సందడి, చిత్రీకరణ, చిత్రంపై ప్రముఖుల అభిప్రాయం, ప్రేక్షకుల స్పందనలను వీడియో ద్వారా మరోసారి గుర్తు చేశారు.

"ఇప్పటికీ మన చుట్టూ ఈలలు, అరుపులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమ చిత్రంగా ఆదరించిన అభిమానులందరికీ రుణపడి ఉంటాం. ఈ అభిమానమే 'కేజీఎఫ్‌- చాప్టర్‌ 2'ను తెరకెక్కించడానికి ఇంధనంగా మారింది" అని చిత్రబృందం పేర్కొంది. 'కేజీఎఫ్‌- చాప్టర్‌ 2'ను ఏప్రిల్‌ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఇటీవల ప్రకటించింది. సంజయ్‌దత్‌, రవీనాటాండన్‌, రావూ రమేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్‌రుర్‌ సంగీతమందించారు.

ఇదీ చూడండి: బాలయ్యతో 'పుష్ప'రాజ్​.. 'ఆహా'లో తగ్గేదేలే!

ABOUT THE AUTHOR

...view details