తెలంగాణ

telangana

ETV Bharat / sitara

KGF 2: 'కేజీఎఫ్​ 2' ట్రైలర్​కు టైమ్​ ఫిక్స్​ - కేజీఎఫ్​ 2 ట్రైలర్​

Yash KGF 2 trailer: కన్నడ స్టార్​ హీరో నటించిన 'కేజీఎఫ్​ 2' చిత్రం నుంచి మరో కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్​ను మార్చి 27న రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Yash KGF 2 trailer
కేజీఎఫ్​ 2 ట్రైలర్

By

Published : Mar 3, 2022, 12:30 PM IST

Yash KGF 2 trailer: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్​ 2' నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్​ను మార్చి 27న సాయంత్రం 6.40గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రబృందం.

కేజీఎఫ్​ 2 ట్రైలర్​కు టైమ్​ ఫిక్స్​

2018లో కన్నడ స్టార్​ హీరో యశ్​ ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్' తొలి భాగం దేశవ్యాప్తంగా విడుదలై, అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. కేజీఎఫ్​ పార్ట్​ 2ను ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీరా ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చూడండి: మరో రీమేక్​లో పవన్​​.. కీలక పాత్రలో సాయితేజ్​!

ABOUT THE AUTHOR

...view details