తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ధైర్యం చేసి ఆ ఫొటోలను షేర్​ చేసిన బాలీవుడ్​ నటి - yami gautam skin

సినీతారలు ఎప్పుడూ అందంగా కనిపించాలనే ప్రయత్నిస్తుంటారు. తమ చర్మం ఎల్లప్పుడూ అందంగా, మృదువుగా ఉండటానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. మేకప్​ లేకుండా వారు బయటకు రావడం చాలా అరుదు. అలాంటింది తమకున్న వ్యాధులను బయటపెట్టడమంటే అది సాహసమనే చెప్పాలి. అందులోనూ ఓ నటీమణీ తనకున్న చర్మ సమస్యను వెల్లడించడానికి.. ఎంతో మానోధైర్యం కావాలి. అలాంటి సాహసమే చేసింది నటి యామీ గౌతమ్(Yami Gautam News).

Yami Gautam News
యామీ గౌతమ్

By

Published : Oct 4, 2021, 10:14 PM IST

సామాజిక మాధ్యమాల్లో తన ఖాతాలను వాస్తవానికి దగ్గరగా ఉంచుతుంది ప్రముఖ నటి, మోడల్ యామీ గౌతమ్ (Yami Gautam News). ఫిల్మ్​మేకర్​ ఆదిత్య ధర్​తో తన వివాహాన్ని కూడా చాలా సింపుల్​గా జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సోషల్​ మీడియాలో ఎడిట్​ చేయని ఫొటోలు పెట్టి సాహసమే చేసింది. అంతేకాక తనకు కెరటోసిస్ పైలేరిస్​ అనే వ్యాధి(Yami Gautam Skin) కూడా ఉందని తెలిపింది.

యామీ

"నేను ఇటీవలే ఓ ఫొటో షూట్​లో (Yami Gautam Latest Photoshoot) పాల్గొన్నా. ఆ ఫొటోలు.. నా చర్మ వ్యాధి కెరటోసిస్ పైలేరిస్​ను దాచడానికేనని పోస్ట్​ ప్రొడక్షన్​కు(సాధారణంగా జరిగే ప్రక్రియే) వెళ్లేముందు నాకొకటి అనిపించింది. 'హే యామీ.. ఈ వాస్తవాన్ని ఎందుకు స్వీకరించకూడదు. దానిని అలాగే అంగీకరించాలి. మరేం పర్వాలేదు' అని నాకు నేను అనుకున్నా."

- యామీ గౌతమ్, నటి

ఫొటోకు పోజిస్తూ

ఈ వ్యాధి గురించి తన పోస్ట్​లోనే వివరించింది యామీ (Yami Gautam Latest News). "కెరటోసిస్ పైలేరిస్​ సోకితే చర్మంపై చిన్నపాటి దద్దుర్లు వస్తాయి. అయితే అవి మీ ఆలోచనలు, మీ పక్కింటి ఆంటీలు అనుకునేంత అసహ్యంగా అయితే ఉండవు. టీనేజీలో ఉన్నప్పుడు నాకీ వ్యాధి సోకింది. దానికి ఇప్పటికీ చికిత్స లేదు" అని యామీ రాసుకొచ్చింది.

యామీ గౌతమ్

"చాలా ఏళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతూ వస్తున్నా. ఇప్పుడు నా భయాలు, ఆందోళనలను వీడాలని నిర్ణయించుకున్నా. నాలోని లోపాలను మనస్ఫూర్తిగా స్వీకరించి, ప్రేమించడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. ఈ నిజాన్ని మీతో పంచుకునే ధైర్యం కూడా సాధించా. ఇక నేను ఎంతమాత్రం నా దద్దుర్లను దాచాలని, కళ్ల కింది భాగాన్ని మృదువుగా చేయాలని, నడుమును మరి కొంత షేపింగ్​ అప్​ చేయాలని గానీ అనుకోవడం లేదు. అయినా నేను చాలా అందంగా ఉన్నాననే భావన కలుగుతోంది."

- యామీ గౌతమ్, నటి

యామీ గౌతమ్

ఈ పోస్ట్​ పట్ల అభిమానులు యామీని(Yami Gautam News) ఎంతగానో కొనియాడుతున్నారు. అందం ప్రమాణాలను పునర్నిర్వచించడం, బాడీ పాజిటివిటీ, ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించుకోవాడం లాంటివాటి ప్రాముఖ్యాన్ని మరోసారి తెలియజేసిందంటూ ప్రశంసిస్తున్నారు.

నటి యామీ గౌతమ్

ఇక సినిమాల(Yami Gautam Movies) పరంగా ఇటీవలే వచ్చిన 'భూత్​ పోలీస్​'లో సందడి చేసింది యామీ. తర్వాత ఆమె నుంచి 'లాస్ట్', 'దస్వీ', 'ఎ థర్స్​డే' అనే చిత్రాలు రానున్నాయి.

ఇదీ చూడండి:పారిస్​ ఫ్యాషన్​ వీక్​లో ఐశ్వర్యా రాయ్ హొయలు.. ఫొటోలు వైరల్

ABOUT THE AUTHOR

...view details