తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బుల్లితెర​ నుంచి వెండితెర​ స్టార్స్​గా - World Television Day 2020

బుల్లితెరపై కెరీర్​ ప్రారంభించిన కొందరు నటీనటులు.. అక్కడితోనే ఆగిపోకుండా చాలా ముందుకు వెళ్లారు. వెండితెరపైనా సత్తా చాటి తామెంటే నిరూపించుకున్నారు. స్టార్ హోదా దక్కించుకుని, ఎందరో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించారు. ఇంతకీ వారెవరు? ఎప్పుడు కెరీర్​ ప్రారంభించారు?

stars
సార్స్​

By

Published : Nov 22, 2020, 6:16 PM IST

నటనలో రాణించాలనే వారి కల, లక్ష్యం.. సినీ రంగం వైపు అడుగులు వేయించాయి. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన.. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చేసింది. బుల్లితెరపై ధారావాహికలు, టీవీ షోల్లో నటించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ వెండితెరపై అరంగేట్రం చేశారు. తమ సినిమాల కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే స్థాయికి చేరుకున్నారు. భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. అలాంటి కొందరు నటీనటుల గురించే ఈ ప్రత్యేక కథనం.

షారుక్ ఖాన్

బాలీవుడ్‌ చరిత్రలోనే 14 ఫిల్మ్​ఫేర్​ అవార్డులు అందుకున్న ఏకైక నటుడు షారుక్ ఖాన్‌! మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు అత్యంత ఆప్తుడు. బాలీవుడ్‌ బాద్​షాగా పిలుచుకునే ఈయన.. 1980లో బుల్లితెర వ్యాఖ్యాత తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 1992లో 'దీవానా' సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. ఇప్పటికీ పలు చిత్రాల్లో చేస్తూ స్టార్​ హీరోగా ఉంటున్నారు.

షారుక్​ ఖాన్​

విద్యాబాలన్​

వైవిధ్యమైన నటనతో అభిమానుల మనసులో చోటు సంపాదించుకున్న నటి విద్యాబాలన్​. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. 16 ఏళ్లకే 'హమ్​ పాంచ్'​ ధారావాహికతో కెరీర్​ను ప్రారంభించింది. ఆ తర్వాత 'పరిణీతా' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఈ మధ్యే 'శకుంతలా దేవి' బయోపిక్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం 'షెర్ని'లో నటిస్తోంది. ఉత్తమ నటిగా పద్మశ్రీ, జాతీయ అవార్డులను కూడా గతంలో అందుకుంది.

విద్యాబాలన్​

సుశాంత్​ సింగ్​

బాలీవుడ్​ యువ నటుడు సుశాంత్​ సింగ్​... సూపర్​హిట్​ సీరియల్​ 'పవిత్ర రిస్తా'లో నటించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అంతకముందే 'కిస్​ దేశ్​ మే హై మేరా దిల్​' ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమ్యారు. 'జరా నాచ్కే దిఖా', 'జలక్​ దికల్ ఆజా 4' లాంటి రియాల్టీ షోల్లోనూ పాల్గొని అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్​లో పలు సినిమాలు చేసినా సరే టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ బయోపిక్​తో చాలా పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది జూన్ 14న తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సుశాంత్​ సింగ్​

ఇర్ఫాన్ ఖాన్​

భారతీయ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్​ ఖాన్. బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన ఆయన ప్రయాణం చిరస్మరణీయం. సహాయ పాత్రలతో మొదలై, తన కోసమే దర్శకులు ప్రత్యేకంగా పాత్ర రాసే స్థాయికి ఎదిగిన నటుడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన.. కెరీర్​లో దాదాపుగా నటనకు ప్రాధాన్యమున్న​ పాత్రలే పోషించారు. ఆయన ప్రతిభకు పద్మశ్రీ, జాతీయ అవార్డులు వరించాయి. బుల్లితెరపై చాణక్య, భారత్​ ఏక్​ ఖోచ్, బనేగీ అప్నీ బాత్​ లాంటి ప్రేక్షాదరణ పొందిన ధారావాహికలతో మెప్పించారు. ఈ క్రమంలోనే క్రైమ్​ నేపథ్యంలో విడుదలైన 'సలామ్​ బాంబే' చిత్రంలో సిల్వర్​ స్క్రీన్​పై అరంగేట్రం చేశారు.

ఇర్ఫాన్​ పఠాన్​

శరద్​ కేల్కర్​

2004లో దూరదర్శన్​లో ప్రసారమైన 'ఆక్రోష్' సీరియల్​తో ప్రేక్షకులకు పరిచయమయ్యారు శరద్​ కేల్కర్​. ఆ తర్వాత పలు ​ప్రకటనల్లోనూ కనిపించారు. అలా సినిమాల్లోకి వచ్చి గొప్ప నటుడిగా ఎదిగారు. ఇటీవల అక్షయ్​కుమార్​ 'లక్ష్మీబాంబ్​' సినిమాలో హిజ్రాగా కనిపించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

శరద్​ కల్కర్​

యామీ గౌతమ్

యామీ గౌతమ్​.. ఫేస్​ క్రీమ్​ 'ఫెయిర్​ అండ్​ లవ్​లీ' ప్రకటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 'చాంద్​ కీ పార్​ చలో', 'యే ప్యార్​ నా హోగా కామ్'​ లాంటి టీవీ షోల్లోనూ నటించి, అభిమానులను సంపాదించుకుంది. అలా 2009లో 'ఉల్లాస ఉటాషా' సినిమాతో బిగ్​ స్కీన్​పై తొలిసారి కనిపించి అలరించింది. అనంతరం తెలుగు, హిందీ, తమిళ సహ పలు భాషల్లో నటించింది. ప్రస్తుతం 'భూత్ పోలీస్'​ సినిమాలో చేస్తోంది.

యమీ గౌతమ్​

మాధవన్​

లవర్‌బాయ్‌గా అనతికాలంలోనే యూత్​లో క్రేజ్ సంపాదించుకున్న​ నటుడు మాధవన్‌. ఈ సొట్టబుగ్గల హీరో తన నటనతో అటు క్లాస్‌నూ, ఇటు మాస్‌నూ బాగా ఆకట్టుకున్నారు. ఈ మధ్య ప్రతినాయక పాత్రలను పోషిస్తూ సదరు పాత్రలకు పెట్టింది పేరు అనిపించుకుంటున్నారు. 'రెహ్నే హై తేరే దిల్​ మే​' సీరియల్​తో నట ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన.. 'ఐస్​ రాత్​ కి సుభా నహీ' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించి వెండితెర అరంగేట్రం చేశారు. దర్శకుడు మణిరత్నం తీసిన 'సఖి' సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మాధవన్​

ఆయుష్మాన్​ ఖురానా

2004లో ఎమ్​టీవీ రౌడీస్​ రియాల్టీ షోతో బుల్లితెరకు ప్రేక్షకులకు చేరువయ్యారు ఆయుష్మాన్​ ఖురానా. యాంకరింగ్​ కూడా చేశారు. 'విక్కీ డోనర్'​ సినిమాతో వెండితెరపై కెరీర్​ ఆరంభించారు. ఆ తర్వాత నౌటంకీ సాలా, ఆర్టికల్​ 15, అంధాదున్​, డ్రీమ్​గర్ల్​, గులాబో సితాబో సహ పలు సూపర్​ హిట్​ చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం 'చంఢీగడ్​ కరే ఆషికీ' సినిమాలో నటిస్తున్నారు.

ఆయుష్మాన్​ ఖురానా

ABOUT THE AUTHOR

...view details