తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విల్సన్​ 'మ్యారీ మీ' అంటున్న జెన్నిఫర్ - మ్యారీ మీ

పాప్​ గాయని జెన్నిఫర్​ లోపెజ్​, నటుడు ఓన్​ విల్సన్​.. రొమాంటిక్​ కామెడీ చిత్రం 'మ్యారీ మీ'లో నటించనున్నారు.

విల్సన్​ 'మ్యారీ మీ' అంటున్న జెన్నిఫర్​ లోపెజ్

By

Published : Apr 23, 2019, 4:36 PM IST

అమెరికా పాప్​ గాయని జెన్నిఫర్​, విల్సన్​ జంటగా ఎస్​టీఎక్స్​ ఫిల్మ్​ సంస్థ 'మ్యారీ మీ' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. క్యాట్​ కాయిరో ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ఏడాది చివరన చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు కథను జానీ రోగర్స్, తమీ సాగెర్​​ అందించగా.. హర్పెర్​ డిల్​ కథలో మార్పులు చేశారు. ఈ చిత్రం బాబీ క్రాస్​బో రచించిన గ్రాఫిక్​ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. జెన్నిఫర్ ప్రధాన పాత్రధారిగా కనువిందు చేయనుంది.
జెన్నిఫర్ ఓ రాక్​స్టార్​ను పెళ్లిచేసుకుంటుంది. అయితే అతడు మోసం చేసినందున ఓ కార్యక్రమంలో అందరి మధ్య బ్రేకప్​ చెబుతూ.. అక్కడ ఉన్న జనంలోంచి ఓ వ్యక్తిని(విల్సన్​) పెళ్లి కొడుకుగా ఎంపిక చేసుకుంటుంది. లోపెజ్​, విల్సన్​ కలిసి 1997లో వచ్చిన 'అనకొండ' సినిమాలో కలిసి పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details