రెండేళ్ల క్రితం విడుదలైన 'జీరో' తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి మరో సినిమా ప్రకటన రాలేదు. తాజాగా షారుక్ నటించబోతోన్న కొత్త సినిమా టైటిల్‌ను 'పఠాన్'గా ఖరారు చేశారు. ఇందులో దీపిక పదుకొణె హీరోయిన్గా నటించనుండగా.. జాన్ అబ్రహం ప్రతినాయక పాత్ర పోషించనున్నాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
షారుక్ చిత్రంలో సల్మాన్.. ఫ్యాన్స్‌కు పండగే! - షారుఖ్ ఖాన్ సినిమాలో సల్మాన్ అతిథి పాత్ర
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి వెండితెరపై కలిసి అలరించనున్నారని తెలుస్తోంది. 'జీరో' చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన సల్మాన్.. మరోసారి షారుక్‌తో కలిసి నటించనున్నాడని సమాచారం.
షారుఖ్ సినిమాలో సల్మాన్ అతిథిపాత్ర!
షారుక్ నటించిన 'జీరో' చిత్రంలోని ఓ పాటలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశాడు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి వెండితెరపై వినోదాన్ని పంచనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తమ అభిమాన హీరోలను ఒకే స్క్రీన్‌పై మరోసారి చూడనున్నారు ఫ్యాన్స్. అయితే ఈ విషయమై 'పఠాన్' చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.