తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధే'కు భారీ నష్టాలు పక్కా.. అయినా ఓకే: సల్మాన్

సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' ఈద్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నష్టాల బారినపడుతుందని తెలిసినా విడుదల చేయడానికి సిద్ధమయ్యామని తెలిపాడు సల్మాన్.

Salman Khan
సల్మాన్ ఖాన్

By

Published : May 11, 2021, 3:21 PM IST

ఈద్ కానుకగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. థియేటర్లు మూతపడటం వల్ల నేరుగా డిజిటిల్ మాధ్యమంలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనిపై స్పందించాడు భాయ్​జాన్. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాకు నష్టాలు వస్తాయని తెలుసని వ్యాఖ్యానించాడు. అన్నింటికీ సిద్ధపడే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని స్పష్టం చేశాడు.

"రాధే' సినిమాకు చాలా తక్కువ కలెక్షన్లు వస్తాయని తెలుసు. ఈ సినిమా 10-15 కోట్లు కూడా సాధించదని అనుకుంటున్నా. ఇలాంటి నష్టాన్ని ఎవరైనా కోరుకుంటారా? కొందరు నా అత్యధిక వసూళ్లను చూసి సంతోషపడతారు. మరికొందరు నా చిత్రాల తక్కువ కలెక్షన్లు చూసి ఆనందిస్తారు. 'రాధే' సినిమా వల్ల మేము నష్టాలబారిన పడతామని తెలుసు. అయినా ఈ చిత్రాన్ని కచ్చితంగా విడుదల చేస్తాం. ఈ సినిమాను విడుదల చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా."

-సల్మాన్ ఖాన్, నటుడు

ఈ చిత్రంలో ఎన్​కౌంటర్ స్పెషలిస్ట్​గా కనిపించనున్నాడు సల్మాన్. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. దిశా పటానీ, రణ్​దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. మే 13 ఈ సినిమా జీఫ్లెక్స్ వేదికగా పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details